AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Astrology: ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!

మే 30న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశిలో రవి (సూర్యుడు) జూన్ 16 వరకు ఒంటరిగా సంచరించనున్నాడు. ఇతర గ్రహాల ప్రభావం లేకుండా రవి సంచారం జరగడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఆదాయం, అధికారం, వృత్తి పురోగతి, కుటుంబ సౌఖ్యం, వారసత్వ సంపద వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో వీరి ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Income Astrology: ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!
Income Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2026 | 3:19 PM

Share

వృషభ రాశిలో సంచారం చేస్తున్న బుధుడు ఈ నెల(మే) 30న మిథున రాశిలోకి మారడంతో అదే రాశిలో సంచరిస్తున్న రవి (సూర్యుడు) జూన్ 16 వరకు ఒంటరి సంచారం సాగించడం జరుగుతోంది. ఇతర గ్రహాల ప్రభావం లేకుండా రవి మరింత స్వతంత్రంగా, సంపూర్ణంగా విజయాలు, సాఫల్యాలచ్చే అవకాశం ఉంది. సహజ ధన రాశి అయిన వృషభంలో రవి సంచారం వల్ల కొన్ని రాశులవారు ఆదాయం పెంచుకోవడానికి, అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారికి విశేషమైన యోగాలు కలుగుతాయి. వీరు ఆదాయం, అధికారం, సమస్యల పరిష్కారం, కుటుంబ సౌఖ్యం, వారసత్వ సంపద వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం మంచిది. పెండింగ్ పనులు, వ్యవహారాలను పూర్తి చేయడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభానికి, పితృ మూలక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.
  2. వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల అనుకోకుండా ఆస్తి లాభం, గృహ లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పూర్తి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభస్థానంలో ధనాధిపతి రవి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు భారీగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభించడానికి అవకాశం ఉంది.
  4. సింహం: రాశ్యధిపతి రవి దశమ స్థాన సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కూడా కలిగింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఒక సంస్థలో ఉన్నతాధికారి అయ్యే యోగం కూడా పడుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో స్వతంత్ర సంచారం చేయడం వల్ల రాజ యోగాలు పడతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు ఆశించిన విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధనలాభం కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమై, సుఖశాంతులు కలుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది.

Follow Us
ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!
ఒంటరి రవి కటాక్షం..వారికి రెట్టింపు ఆదాయం, అధికారం..!
బాబావంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4రాశులివే
బాబావంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4రాశులివే
ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో..
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో..
ఈ 5 వస్తువులను దానం చేయకండి.. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట
ఈ 5 వస్తువులను దానం చేయకండి.. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట
బక్రీద్ వేడుక:జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం
బక్రీద్ వేడుక:జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీకి మూహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీకి మూహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అరటి పండ్ల దోసె.. తింటే, ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా
అరటి పండ్ల దోసె.. తింటే, ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా
ఏపీ, తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ ప్రకటన
ఏపీ, తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ ప్రకటన