అద్దం ముందు అందంగా.. వైట్ డ్రెస్‌లో జాన్వీ గ్లామర్ సెగలు

Samatha

29 May 2026

అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ.

జాన్వీకపూర్

మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముందుగా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

మంచి గుర్తింపు

అందం, అభినయంతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. అంతేకాకుండా వరసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫేమ్ తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

అందం, అభినయం

జాన్వీ కపూర్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుంకుంది.

స్టార్‌గా

ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటించి, ఈ మూవీతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటించింది.

దేవర మూవీతో

ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది, అంటే అతి త్వరలో ఈ బ్యూటీ థియేటర్లో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది ఈ చిన్నది.

పెద్ది మూవీ

ఇక దేవర తర్వాత ఈ అందాల ముద్దుగుమ్మకు తెలుగులో, బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

వరస ఆఫర్స్

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో తన అందాలతో మాయ చేస్తోంది.

బ్యూటిఫుల్ ఫొటోస్