AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ నుంచి బిగ్ అప్డేట్..

ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు లేదని వాతావరణశాఖ తెలిపింది.

Weather Report: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ నుంచి బిగ్ అప్డేట్..
Rains
Venkatrao Lella
|

Updated on: May 29, 2026 | 2:52 PM

Share

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు-మధ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ.. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల అవకాశముంది .బలమైన గాలులు గరిస్టముగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతారణశాఖ హెచ్చరించింది.

ఉష్ణోగ్రతల్లో మార్పు లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆతరువాత రోజుల్లో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అటు తెలంగాణలో రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నిన్న వాయువ్య ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనము నుండి ఉత్తరాంధ్ర కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..

రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు,రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Follow Us