AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Alert: ఇంటి పైకప్పుపై ఈ వస్తువులు ఉన్నాయా..? అయితే శాంతి, సంపద ఇంటి నుంచి దూరమవుతాయట!

Terrace Vastu: మనం సాధారణంగా గదులు, వంటగది వాస్తుపై శ్రద్ధ పెడతాం. కానీ పైకప్పును మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. వాస్తు ప్రకారం, పైకప్పు కేవలం నడిచే స్థలం కాదు.. ఇంటికి సానుకూల శక్తి ప్రవేశించే ముఖ్యమైన ప్రదేశం. అందుకే ఆనందం, శాంతి, ఐశ్వర్యం నిలవాలంటే పైకప్పును ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం అవసరం.

Vastu Alert: ఇంటి పైకప్పుపై ఈ వస్తువులు ఉన్నాయా..? అయితే శాంతి, సంపద ఇంటి నుంచి దూరమవుతాయట!
Terrace Vastu
Rajashekher G
|

Updated on: May 29, 2026 | 1:41 PM

Share

మనం సాధారణంగా ఇంటి గదులు, వంటగది వాస్తుపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. కానీ పైకప్పు విషయాన్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పైకప్పు కేవలం ఉదయం లేదా సాయంత్రం నడిచే స్థలం మాత్రమే కాదు.. అది ఇంటికి సానుకూల శక్తి ప్రవేశించే ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇంట్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నిలవాలంటే పైకప్పును ఎప్పుడూ శుభ్రంగా, సక్రమంగా ఉంచడం ఎంతో అవసరం.

ఇలా మంచిది కాదు..

వాస్తు ప్రకారం, పైకప్పుపై చెత్త, మురికి లేదా పనికిరాని వస్తువులు పేరుకుపోవడం మంచిది కాదు. ఇవి ప్రతికూల శక్తిని పెంచి వాస్తు దోషాలకు కారణమవుతాయని చెబుతారు. ఇంటి ఇతర భాగాల మాదిరిగానే పైకప్పును కూడా తరచూ శుభ్రం చేయాలి.

ప్రతికూల ప్రభావం..

చాలా ఇళ్లలో పగిలిపోయిన పాత్రలు, పనికిరాని సామాన్లు పైకప్పుపై వేసి ఉంచుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంటి శాంతి, సంతోషాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్మకం. అందుకే అలాంటి వస్తువులను వెంటనే తొలగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

అశుభం..

అలాగే మొక్కలు ఇంటికి అందాన్ని, ఆహ్లాదాన్ని తీసుకువస్తాయి. అయితే ముళ్లతో ఉండే మొక్కలను పైకప్పుపై లేదా ఇంటి లోపల ఉంచడం వాస్తు ప్రకారం అశుభంగా భావిస్తారు. ఇవి కుటుంబంలో ఉద్రిక్తతలు, ప్రతికూలతను పెంచుతాయని అంటారు.

చెడు ప్రభావం..

ఇంకా తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, పాత గ్రిల్స్, వైర్లు, విరిగిన కుర్చీలు లేదా మంచాలు వంటి పనికిరాని సామాన్లు ఇంటి పైకప్పుపై నిల్వ చేయకూడదు. ఇవి ఇంటి వాతావరణంపై చెడు ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

శుభ్రంగా, అందంగా, ఖాళీగా ఉన్న పైకప్పు ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?
SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?
రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ సూచన ఇదే!
రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ సూచన ఇదే!
బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న
రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న
ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి.!
ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి.!
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!
తెలంగాణ ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి తిమింగలం..!