తెలుగులో నో ఆఫర్స్.. పూజకు సన్నగిల్లిన అవకాశాలు.? 

Rajeev 

29 May  2026

instagram

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అగ్ర హీరోలందరితో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది.

తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది.

కెరీర్ మొదట్లో ప్లాపులే అందకున్నప్పటికీ అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంది.

అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి. ఈ మధ్య పూజా నటించిన డిజాస్టర్స్ కావడంతో పూజా సైలెంట్ అయ్యింది.

ఇప్పుడు జననయగాన్ సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. దాంతో తెలుగులో ఈ అమ్మడి ఆఫర్స్ తగ్గిపోయాయని టాక్ వినిపిస్తుంది.