మామిడి పండ్లు తింటే మొటిమలు వస్తాయా?

29 May 2026

TV9 Telugu

TV9 Telugu

మామిడిపండ్ల సీజన్‌లో వాటిని చూస్తూ తినకుండా ఎవరైనా ఉన్నారంటే- వాళ్లు కచ్చితంగా టీనేజీ అమ్మాయిలే. వాటిని తినడం వల్లే మొటిమలు వచ్చాయనీ, వేడి చేసిందని చెబుతూ... ఎంత ఇష్టమున్నా కొందరు వాటిని తాకను గాక తాకరు

TV9 Telugu

నిజమే, ఈ కాలంలో కొందరిలో మొటిమలు ఎక్కువ కావొచ్చు. కానీ ఆ పాపం మామిడి పండుది కాదు అంటున్నారు నిపుణులు. దాన్ని సరైన పద్ధతిలో తీసుకోకపోవడమే. మామిడి గుజ్జులో చక్కెర, పాలు కలిపి ఐస్‌క్రీమ్, డెజర్ట్‌లు చేసుకుని తింటుంటారు

TV9 Telugu

అలాగే వీటితోపాటు నూనెపూరిత స్నాక్స్‌ కూడా ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ కలిసి ఇన్‌ఫ్లమేషన్, మొటిమలకు కారణమవుతాయి. అదే నేరుగా మామిడి పండును తినడం వల్ల ఏ సమస్యా ఉండదు

TV9 Telugu

అయితే కొందరికి మామిడి తొక్కలోని ఉరుషియోల్‌ అనే రెజిన్‌ పదార్థం వల్ల అలర్జీ వస్తుంది. జీడిగింజ తొక్కల్లోనూ ఎక్కువగా ఉండే ఈ పదార్థం మామిడి ఆకులు, కాడలు, తొక్కలో కొద్దిపాళ్లలో ఉంటుంది

TV9 Telugu

కానీ గుజ్జులో ఉండదు. దీనివల్ల నోరు, ముఖం, చేతులమీద దురదతో కూడిన దద్దుర్లు వస్తాయి. వీటినే మొటిమలుగా పొరబడుతుంటారు

TV9 Telugu

కానీ ఇది మ్యాంగో డెర్మటైటిస్‌.. ఇది రాకుండా ఉండాలంటే అలర్జీ ఉన్నవాళ్లు తినేముందు కాయనూ, తొక్క తీశాక చేతుల్నీ శుభ్రంగా కడగడం... వంటివి పాటించాలి.

TV9 Telugu

సాధారణంగా హార్మోన్ల మార్పులు, జిడ్డు చర్మం, నిద్రలేమి, ఒత్తిడి, డీహైడ్రేషన్, సరైన చర్మ సంరక్షణ తీసుకోకపోవడంతోపాటు జన్యు కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి

TV9 Telugu

అంతేతప్ప మామిడి పండు వల్ల రావు. ఇంకా చెప్పాలంటే, మామిడిపండు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు. వాటిల్లో ఎ, సి విటమిన్లు, ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. కాబట్టి మామిడి పండ్లను హాయిగా ఆస్వాదించవచ్చు