Astrology: శని రవుల యుతి.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!

Sun Saturn Yuti: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవికి శని కుమారుడవుతాడు.అయినా శని, రవులను బద్ధ శత్రువులుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు కలిసినా, ఒకరినొకరు వీక్షించుకున్నా కొన్ని రాశులకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు, సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కుంభ రాశిలో శని, రవులు కలవడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని యోగాలు పట్టే అవకాశం ఉంది కానీ, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలనివ్వడం జరుగుతుంది.

Astrology: శని రవుల యుతి.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
Sun Saturn Yuti
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 13, 2025 | 4:31 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని, రవులు బద్ధ శత్రువులు. రవికి శని కుమారుడవుతాడు. ఈ రెండు గ్రహాలు కలిసినా, ఒకరినొకరు వీక్షించుకున్నా కొన్ని రాశులకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు, సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కుంభ రాశిలో శని, రవులు కలవడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల కొన్ని రాశులకు యోగాలు పట్టే అవకాశం ఉంది కానీ, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలనివ్వడం జరుగుతుంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు ఈ కలయిక విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ శివార్చన చేయించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

  1. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని, రవుల కలయిక వల్ల ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి విశ్రాంతి కరువవుతుంది. అధికారులతో వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. తండ్రితో అకారణ వైరం ఏర్పడవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
  2. సింహం: ఈ రాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శత్రువులు, పోటీదార్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. అధికారుల నుంచి లేనిపోని విమర్శలు, వేధింపులు వచ్చే అవకాశం ఉంది. ఎవరినీ ఏ విషయంలోనూ గుడ్డిగా నమ్మక పోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు ప్రతికూలంగా మారవచ్చు. జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.
  3. వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శని, రవులు కలుస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా సమ స్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. కొందరు మిత్రులు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించి తండ్రితో విభేదాలు కలుగుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో కొద్దిగా సంతోషం లోపిస్తుంది.
  4. మకరం: ఈ రాశికి ధన స్థానంలో శని, రవుల యుతి జరుగుతున్నందువల్ల ఆర్థికంగా నష్టపోవడమో, మోసపోవడమో జరుగుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ధన పరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు, మాటల వల్ల బాగా ఇబ్బంది పడతారు.
  5. కుంభం: ఈ రాశిలో శని, రవుల సంచారం వల్ల అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పొరపాట్లు జరగడం లేదా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. కష్టార్జితం బాగా పెరుగుతుంది కానీ, అందులో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. తండ్రితో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. ఆస్తుల పెంపకంలో కొద్దిగా నష్టపోయే అవ కాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఓర్పుగా ఉండడం అవసరం.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని, రవుల సంచారం వల్ల అనుకోకుండా వైద్య ఖర్చులు పెరుగు తాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి.ఆదాయ ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి.