Horoscope Today: వారికి పదోన్నతికి అవకాశం ఉంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (January 14, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి పదోన్నతికి అవకాశం ఉంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 14th January 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 14, 2025 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 14, 2025): మేష రాశి వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది కానీ, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలున్నాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, ఊరట చెందుతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ది చెందుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కొద్దిపాటి శ్రమతో తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. ఉద్యోగాలు మారడా నికి సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగపరంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబం మీద బాగా ఖర్చుపెడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశిం చిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల దన నష్టం జరిగే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభవార్త అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరు లకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థికపరంగా ప్రస్తుతానికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అనుకోకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దాని కంటే మించి సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు.

మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
ఎంపీ ఇంటి ప్రాంగణంలో చిరుత పులి కలకలం.. షాకింగ్‌ వీడియో వైరల్..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
నార్త్ అమెరికాలో కలెక్షన్స్‌‏ను కుమ్మేస్తున్న వెంకటేశ్‌ సినిమా..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్..
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
యానాంబీచ్‌లో సంక్రాంతి సందడి బీచ్‌ బైక్‌లనుప్రారంభించిన ఎమ్మెల్యే
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!
భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!