Sun In Astrology: మనిషి జీవితంలో రవి నీచ స్థితిలో ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయట.. నివారణ చిట్కాలు మీకోసం

మనిషి జాతకంలో రవి నీచ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి మార్గం కష్టాలతో నిండి ఉంటుంది. ఆదివారం సూర్యుడి కోసం ఉపవాసం ఉండి పూజించడం ద్వారా సంతుష్టుడవుతాడు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

Sun In Astrology: మనిషి జీవితంలో రవి నీచ స్థితిలో ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయట.. నివారణ చిట్కాలు మీకోసం
Astrology
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2022 | 10:08 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్య భగవానుడు అన్ని గ్రహాలకు అధిదేవత. ఒక వ్యక్తి గ్రహాలు, రాశులు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తాడని నమ్మకం. అందుకనే గ్రహాల శాంతికోసం అనుకూల దృష్టిని కోరుతూ రకరకాల పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు కొందరు. అయితే సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు. మనిషి సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. కీర్తి, బలం, గర్వం , గౌరవానికి చిహ్నం. అయితే మనిషి జాతకంలో రవి నీచ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి మార్గం కష్టాలతో నిండి ఉంటుంది. ఆదివారం సూర్యుడి కోసం ఉపవాసం ఉండి పూజించడం ద్వారా సంతుష్టుడవుతాడు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

  1. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
  2. కొన్ని కారణాల వల్ల మీరు ఉదయాన్నే నిద్రలేవలేకపోతే..  మధ్యాహ్నానికి ముందు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. దీనితో, మీ సమస్యలన్నీ క్రమంగా తొలగుతాయి.
  3. మీ జాతకంలో సూర్య గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు, ఉప్పు తినడం తగ్గించాలని నమ్మకం.
  4. రాగి కంకణాన్ని చేతికి ధరించడం వల్ల కూడా సూర్యుని చెడు ప్రభావం నుండి బయటపడవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. సూర్యుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటే.. ఆ వ్యక్తి తన తండ్రిని గౌరవించాలి
  7. స్నానం, ధ్యానం తర్వాత ఓం హ్రీం హ్రీం సః సూర్యాయ నమః । ఓం ఘృణి సూర్యాయ నమః. శత్రువుల నాశనానికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠించండి.
  8. సూర్య గ్రహం ప్రశాంతంగా ఉండాలంటే రూబీ స్టోన్ ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
  9. వీలైతే, ఆదివారం ఉపవాసం ఉండండి. ఇలా చేయడం వల్ల రవి ప్రశాంతంగా ఉంటాడు. గ్రహాల అనుగ్రహం ఉంటుంది.

సూర్యుడు రాశి చక్రంలో బలహీనంగా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలంటే:

మీ జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే.. మీరు మీ స్వంత తండ్రి, గురువుకి మధ్య వివాదం నెలకొంటుంది. మీరు ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటారు. అహంకార భావన ఉంటుంది. అన్ని వేళలా బలహీనంగా ఉంటారు. ఏదైనా పని చేయగలరు. మీ కుటుంబంలో ఆస్తికి సంబంధించిన వివాదం ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..