Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేయని తప్పులకు నిందలు పడే అవకాశం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 14వ తేదీ ) కార్తీక సోమవారంరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేయని తప్పులకు నిందలు పడే అవకాశం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2022 | 6:36 AM

Horoscope Today (14-11-2022):  రోజులో  ఏ పనులు మొదలు పెట్టాలన్నా ఈ రోజు ఎలా ఉంటుంది.. రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 14వ తేదీ ) కార్తీక సోమవారంరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక బలం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. మొహమాటాన్ని వదిలి శత్రువుల మీద విజయాన్ని నమోదు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒత్తిడిని జయించి  ముందుకు సాగుతారు. కొన్ని పనుల విషయంలో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.పెద్దల ఆశీర్వాదం అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంది. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లారు. అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధువుతులతో శుభకార్యాల్లో సంతోషంగా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి  చేస్తారు. పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు. మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను అందుకుంటారు.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేస్తారు.  ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఆటంకాలు ఎదురైనా మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేయని తప్పులకు నిందపడాల్సి వస్తుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్