Lord Shani Dev: కుంభ రాశిలో శని, రవి కలయిక.. ఆ రాశుల వారికి కష్ట కాలం! పరిహారాలు ఏంటో తెలుసుకోండి..
సాధారణంగా శని, రవి, కుజుడు, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు కలిసినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టనష్టాలు తప్పవు. కొద్దిగా యోగం కలిగించడానికి అవకాశం ఉన్నప్పటికీ, విపరీతంగా ఒత్తిడికి గురి చేయడం, అనారోగ్యాలతో ఇబ్బంది పెట్టడం, వాహన ప్రమాదాలకు లోనవడం, వివాదాలు, విభేదాలు తలెత్తడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రవి, శనులు ప్రస్తుతం కుంభరాశిలో కలవడం వల్ల..
సాధారణంగా శని, రవి, కుజుడు, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు కలిసినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టనష్టాలు తప్పవు. కొద్దిగా యోగం కలిగించడానికి అవకాశం ఉన్నప్పటికీ, విపరీతంగా ఒత్తిడికి గురి చేయడం, అనారోగ్యాలతో ఇబ్బంది పెట్టడం, వాహన ప్రమాదాలకు లోనవడం, వివాదాలు, విభేదాలు తలెత్తడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రవి, శనులు ప్రస్తుతం కుంభరాశిలో కలవడం వల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు కొన్ని కష్టనష్టాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మార్చి నెల 15 వరకు కొనసాగుతుంది. శివార్చన చేయించడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, విష్ణు సహస్ర నామం లేదా సుందరకాండ పారాయణం చేయడం వంటి పరిహారాల వల్ల ఈ కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది.
- కర్కాటకం: అసలే అష్టమ శని కారణంగా కొన్ని విధాలుగా అవస్థలు పడుతున్న ఈ రాశి వారికి అష్టమంలో రవి కూడా చేరడం వల్ల అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం, వేధింపులు ఎదురు కావడం, ప్రభుత్వ పరంగా ఆర్థిక నష్టం జరగడం వంటివి తప్పకపోవచ్చు. నమ్మినవారు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అపనిందలు, అపవాదులకు అవకాశం ఉంటుంది. అనుకున్నదొకటి, అయిం దొకటి అన్నట్టుగా ఉంటుంది. ఇతరులకు హామీలు ఉండి నష్టపోవడం కూడా జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి సప్తమంలో రవి, శనులు చేరడం వల్ల వీరికి తప్పకుండా అధికారులతో లేదా యజమా నులతో ఇబ్బందులుంటాయి. ఈ రాశికి అధిపతి అయిన రవి తన ప్రబల శత్రువైన శనితో చేరడం వల్ల ఆరోగ్య భంగానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులను కోల్పోవడం జరుగు తుంది. తండ్రితో అకారణ విరోధం ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధమైన చిక్కులుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కానీ, నష్టం ఎక్కువగా ఉంటుంది. మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు.
- వృశ్చికం: అర్ధాష్టమ శని కారణంగా ఇప్పటికే ఇబ్బందులు పడుతూ, ఒత్తిడికి గురవుతున్న ఈ రాశి వారికి శనితో రవి కలవడంతో ఉద్యోగపరమైన చిక్కులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలతో పాటు ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగా తగ్గు తుంది. అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. సహనంగా ఉండడం మంచిది.
- కుంభం: ఈ రాశిలో రవి, శనులు కలవడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లేని జీవి తం ఏర్పడుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణా మోసం చేయడం, నష్టపరచడం జరుగు తుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశముంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి అప్రతిష్ఠ పాలవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉన్నప్పటికీ అలవికాని లక్ష్యాలు, పని భారంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు పెరుగుతాయి.
- మీనం: ఏలిన్నాటి శని కారణంగా చేతిలో డబ్బు నిలవక ఇబ్బంది పడుతున్న ఈ రాశివారు ఈ రవి, శనుల కలయిక వల్ల అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. హామీలు ఉండి, వాగ్దానాలు చేసి నష్టపోయే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల బాగా కష్టనష్టాలకు లోనవుతారు. తండ్రితో అకారణ వైరం ఏర్పడు తుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.