Money Astrology: శనితో రవి కలయిక.. ఆ రాశుల వారికి అపార ధన లాభం, ఉద్యోగ లాభం..!
సాధారణంగా ఉపచయ రాశుల్లో పాప గ్రహాలు కలిసినప్పుడు అపార ధన లాభం, ఉద్యోగ లాభం, వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉపచయ స్థానాలంటే 3,6,10,11 స్థానాలు. వీటిని వృద్ధి స్థానాలని, గ్రోత్ సెంటర్స్ అని కూడా అంటారు. ప్రస్తుతం కుంభ రాశిలో రవి, శనులు కలిసిన కారణంగా ఆరు రాశుల వారికి వృద్ధి యోగం పడుతోంది.
సాధారణంగా ఉపచయ రాశుల్లో పాప గ్రహాలు కలిసినప్పుడు అపార ధన లాభం, ఉద్యోగ లాభం, వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉపచయ స్థానాలంటే 3,6,10,11 స్థానాలు. వీటిని వృద్ధి స్థానాలని, గ్రోత్ సెంటర్స్ అని కూడా అంటారు. ప్రస్తుతం కుంభ రాశిలో రవి, శనులు కలిసిన కారణంగా ఆరు రాశుల వారికి వృద్ధి యోగం పడుతోంది. అవి మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులు. ఇందులో మేషం, వృషభం, కన్య, ధనూ రాశి వారికి వృద్ధి యోగం పడుతుండగా తుల, మకర రాశుల వారికి మహా భాగ్య యోగం పడుతోంది. ఈ యోగాలు మార్చి నెల 15 వరకు కొనసాగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి 10, 11 ఉపచయ స్థానాలు పటిష్టంగా ఉన్నందువల్ల తప్పకుండా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆదాయంతో పాటు ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఊహించని రీతిలో సంపన్నుడయ్యే సూచనలున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు చోటు చేసుకోవడం, వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగి పోవడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం, మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరుగుతాయి.
- వృషభం: ఈ రాశికి పదవ స్థానంలో రవి, శనులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాలు అనేక విధాలుగా లాభా లను కురిపిస్తాయి. రాబడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండు పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి, శనులు కలవడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నత స్థానాలకు వెళ్లే అవ కాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
- తుల: ఈ రాశివారికి పంచమ స్థానంలో రవి, శనుల కలయిక వల్ల అనేక విధాలుగా మహా భాగ్య యోగం పడుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక ఆదాయ మార్గాలు ఈ రాశివారి ముందుకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యాలనుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయంలో రవి, శనుల యుతి జరిగినందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారం అవు తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో రవి, శనుల కలయిక వల్ల ధనవృద్ధికి, కుటుంబ వృద్ధికి బాగా అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు అధికారులకు ఉపయోగపడతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి మిత్రులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు.