AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: చక్రం తిప్పనున్న ఒంటరి శని.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..!

Saturn's New Position: మే 31 నుండి శని మీన రాశిలో ఒంటరిగా సంచరించబోతున్నాడు. దీంతో మీన రాశిలోకి శని మార్చి 29న ప్రవేశించడంతో శని, అష్టమ శని, ఏలిన్నాటి శని దోషాల నుంచి విముక్తి పొందిన రాశుల వారికి శుభ ఫలితాలను శనీశ్వరుడు అందివ్వబోతున్నాడు. వీరికి ఆర్థిక వృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆరోగ్య పురోగతి లాంటివి కలుగుతాయి. కొన్ని రాశులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ రాశుల వారు తమ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.

Lord Shani Dev: చక్రం తిప్పనున్న ఒంటరి శని.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..!
Lord Shani Dev
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2025 | 4:05 PM

Share

Lord Shani: ఇప్పటి వరకూ మీన రాశిలో ఇతర గ్రహాలతో కలిసి ఉన్న శనీశ్వరుడు ఈ నెల 31 నుంచి ఒంటరి కాబోతున్నాడు. గత మార్చి 29న మీన రాశిలో శని ప్రవేశించడంతో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన్నాటి శని వంటి దోషాల నుంచి విముక్తి పొందిన రాశులకు మే 31 నుంచి పూర్తి స్థాయి శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారముంది. ఒంటరిగా, స్వతంత్రంగా మీన రాశిలో శని సంచారం 2026 ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. శని దోషాల నుంచి బయటపడిన వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర, కుంభ రాశులకు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలోకి శని ప్రవేశించడం వల్ల జీవితంలో అనేక విధాలైన శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయా లన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు.
  2. కర్కాటకం: శని మీన రాశి ప్రవేశంతో అష్టమ శని నుంచి బయటపడిన ఈ రాశి వారు నవమ శని కారణంగా విదేశీయానానికి అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవ కాశాలు లభిస్తాయి. కొన్ని కష్టనష్టాల నుంచి, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం మొదలవుతుంది. ఆదాయ వృద్ధితో పాటు అనేక విధాలైన పురోగతి ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది.
  3. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
  4. వృశ్చికం: రెండున్నరేళ్ల అర్ధాష్టమ శని కష్టనష్టాల నుంచి బయటపడిన ఈ రాశివారు పంచమ శని వల్ల అనేక విధాలుగా పురోగతి చెందడం ప్రారంభమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన పదోన్నతులు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. పని ఒత్తిడి, వ్యయ ప్రయాసలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  5. మకరం: ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం కారణంగా అస్తవ్యస్తం అయిపోయిన జీవితం శని తృతీయ స్థాన ప్రవేశంతో మళ్లీ పట్టాల మీదకు ఎక్కడం ప్రారంభమవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశముంది. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో హోదాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  6. కుంభం: శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశివారికి కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. శని ద్వితీయ రాశి సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోనప్పటికీ, ఆర్థిక స్థితిగతులకు ఇక ఇబ్బంది ఉండదు. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ధనాదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం ప్రారంభం అవుతుంది. కుటుంబ సమస్యలు బాగా తగ్గిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు