- Telugu News Photo Gallery Spiritual photos Mars in Leo: These zodiac signs to have dhana yogas details in Telugu
Dhana Yoga: సింహ రాశిలో కుజుడి సంచారం.. ఈ రాశుల వారికి ధన యోగాలు పట్టబోతున్నాయ్..!
Mars Transit 2025: ఆస్తిపాస్తులకు, భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి, పోరాటాలకు, పట్టుదలకు కారకుడైన కుజుడు జూన్ 7 నుంచి జూలై 28 వరకు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిత్ర క్షేత్రమైన సింహ రాశిలో కుజుడు ఉచ్ఛ బలంతో వ్యవహరిస్తాడు. కుజుడు అనుకూలంగా ఉన్న పక్షంలో ఆదాయ వృద్ధిలోనూ, ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ, ఉద్యోగంలోనూ శీఘ్ర పురోగతి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం కూడా కలుగుతుంది. కుజుడి సింహ రాశి సంచారం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి అనేక విషయాలలో బలం పెరుగుతుంది.
Updated on: May 26, 2025 | 3:48 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులను అధిరోహిస్తారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. మీ సమర్థత బాగా రాటుదేలుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర మదుపులు, పెట్టుబడుల వల్ల అంచనాలకు మించిన లాభం కలుగుతుంది. పిల్లల చదువుల విషయంలో మంచి శ్రద్ద తీసుకుంటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. జీవితంలో అన్ని విధాలా స్థిరపడడానికి అవకాశాలు బాగా అందివస్తాయి.

మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి, ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి బయటపడతారు. సోదరులతో ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. పోటీదార్లపై పైచేయి సాధిస్తారు.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అత్యథికంగా పెరుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటిని అమర్చుకుంటారు. ప్రముఖులతో లాభదాయక వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

సింహం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. భూ లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి లాభం, గృహ లాభం కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. అందలాలు ఎక్కుతారు. జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. సొంత ఇల్లు అమరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.



