సప్తమ స్థానంలో అనుకూల గ్రహం.. ఆ రాశుల వారికి దాంపత్య జీవితంలో సమస్యలు ఇక ఫసక్..!
Relationship Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం సప్తమ స్థానం భార్యాభర్తల సంబంధాలను, ప్రేయసీ ప్రియుల సంబంధాలను, దాంపత్య జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం గోచారంలో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహాన్ని బట్టి ఈ రాశుల వారికి ఈ రెండు రకాల సంబంధాలు పటిష్ఠం కావడానికి, మెరుగుపడడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశుల వారికి దాంపత్య సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం సప్తమ స్థానం భార్యాభర్తల సంబంధాలను, ప్రేయసీ ప్రియుల సంబంధాలను, దాంపత్య జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం గోచారంలో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహాన్ని బట్టి సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఈ రెండు రకాల సంబంధాలు పటిష్ఠం కావడానికి, మెరుగుపడడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశుల వారికి దాంపత్య సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శనీశ్వరుడే సంచారం చేస్తున్నందువల్ల దాంపత్య జీవి తం మరింత మెరుగుపడడానికి, దాంపత్య జీవితంలోని పొరపచ్చాలు, మనస్పర్థలు సమసిపోవ డానికి బాగా అవకాశం ఉంది. విడాకుల కేసుల్లో ఉన్నవారు కూడా రాజీపడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. సాధారణంగా మంచి ఉద్యో గంలో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీస్తుంది.
- కన్య: ఈ రాశికి సప్తమంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల సానుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నా చితకా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. భార్యాభర్తలు ఒకే రక మైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు అయి ఉండే అవకాశం ఉంది. ఇద్దరూ ఒకే సంస్థలో పని చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి. భార్యాభర్తలు లేదా ప్రేయసీ ప్రియులు ఎక్కువగా విహార యాత్రలు చేసే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందువల్ల సాధారణంగా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు తలెత్తే అవకాశం ఉండదు. అభిప్రాయభేదాలు కలిగినప్పటికీ, పెద్దల జోక్యంతో సత్వరం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం, అన్యో న్యత కాస్తంత ఎక్కువగానే ఉండే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా, అన్యోన్యంగా సాగిపోతాయి. స్నేహితుల మధ్య ప్రేమ ఏర్పడి పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల మధ్య మధ్య చిరాకులు, చికాకులు తప్పనప్ప టికీ, భార్యాభర్తల మధ్య విడదీయరాని బంధం ఏర్పడడానికి బాగా అవకాశం ఉంది. ఇద్దరి అభిరు చులూ ఒకే మార్గంలో సాగిపోతాయి. వివాహ బంధం మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఎటువంటి సమస్యలున్నా తేలికగా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా పురోగతి చెందుతాయి. అతి తక్కువ కాలంలో అతి గాఢమైన ప్రేమ ఏర్పడు తుంది.
- కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నందువల్ల వివాహ బంధం గట్టి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు తలెత్తినా అవి వెను వెంటనే సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సామరస్యం బాగా వృద్ధి చెందుతాయి. బంధువర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవ హారాలు నిరాటంకంగా, విజయవంతంగా సాగిపోతాయి. తప్పకుండా ఇవి పెళ్లికి దారితీస్తాయి.
- మీనం: ఈ రాశికి సప్తమంలో శుక్ర, కేతువులు ఉన్నందువల్ల భార్యాభర్తల అనుబంధం ఎటువంటి సమ స్యలూ లేకుండా సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంటుంది. విడాకుల కేసుల్లో కూడా ఇద్దరి మధ్యా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు ఏమాత్రం లోటుండదు. సాటి ఉద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా అతి తక్కువ కాలంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ ప్రేమలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.