Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 11, 2024): మేష రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కనిపిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 11, 2024): మేష రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కనిపిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరగడం వల్ల పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది కానీ రాబడి వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆల యాలను ఎక్కువగా సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు, వ్యవహారాలన్నీ చకచకా పూర్త వుతాయి. ఇష్టమైన బంధువులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా అభివృద్ధి బాట పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రాజకీయ వర్గాలతో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏ పని చేపట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం చేకూరుతుంది. ఆస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చకపోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి సంపాదనకు లోటుండదు. కొందరు చిన్ననాటి మిత్రుల్ని అనుకోకుండా కలుసుకుంటారు. కొత్త వాహన యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండక పోవచ్చు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి వ్యవహారమూ సకాలంలో పూర్తవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు బాగా తగ్గుతాయి. బాధ్యతల్లో మార్పులు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొద్దిగా ఆదాయ వృద్ధి ఉంటుంది. అను కోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడంలో ఆటంకాలుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరవవుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, నిలకడగా సాగిపోతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుండే అవకాశం ఉంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో కొన్ని సమస్యలు తీరిపోయి ఊరట చెందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు అంచనాలకు మించి విజయాలు సాధిస్తారు. మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. విలువైన గృహో పకరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అదనపు పని భారం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగ డంతో పాటు రాబడి కూడా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే అవ కాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మిత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధుమిత్రుల వివాదా లకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు తీరిక లేకుండా ఉత్సాహంగా సాగిపోతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం సవ్యంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులు మీకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలకు మంచి గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు సవ్యంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగి పోతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవు తాయి. కుటుంబంతో ఆలయ దర్శనాలు చేసు కుంటారు. పనులు, వ్యవహారాలన్నీ సజావుగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల బాధ్యత లను తలకెత్తుకుని సొంత పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శ్రవణం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారులకు నమ్మకం పెరిగి మరీ ఎక్కువగా ఆధార పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరి చయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రతిఫలాలనిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. దూరపు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభా లుంటాయి. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి.