Lucky Horoscope: అత్యంత అరుదైన గ్రహ కలయిక.. ఆ రాశుల వారికి సరికొత్త అదృష్ట యోగాలు..!

ఈ నెల 16, 17, 18 తేదీల్లో గ్రహచారంలో ఒక విచిత్రమైన యుతి చోటు చేసుకోబోతోంది. ఇది అత్యంత అరుదైన గ్రహ కలయిక. ప్రస్తుతం రవి సింహంలో, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు తండ్రీ కొడుకులు. అయితే, బద్ధ శత్రువులు. అదే విధంగా ఈ మూడు రోజుల్లో చంద్ర, బుధుల మధ్య కూడా సమ సప్తక దృష్టి ఏర్పడుతోంది.

Lucky Horoscope: అత్యంత అరుదైన గ్రహ కలయిక.. ఆ రాశుల వారికి సరికొత్త అదృష్ట యోగాలు..!
Lucky Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 11, 2024 | 5:18 PM

ఈ నెల 16, 17, 18 తేదీల్లో గ్రహచారంలో ఒక విచిత్రమైన యుతి చోటు చేసుకోబోతోంది. ఇది అత్యంత అరుదైన గ్రహ కలయిక. ప్రస్తుతం రవి సింహంలో, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం వల్ల ఈ రెండు గ్రహాల మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు తండ్రీ కొడుకులు. అయితే, బద్ధ శత్రువులు. అదే విధంగా ఈ మూడు రోజుల్లో చంద్ర, బుధుల మధ్య కూడా సమ సప్తక దృష్టి ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాలు కూడా తండ్రీ కొడుకులే. పైగా చంద్రుడు కుంభ రాశిలో, బుధుడు సింహ రాశిలో సంచరించడం జరుగుతోంది. ఈ విధంగా రెండు రకాల తండ్రీ కొడుకుల మధ్య ఒకేసారి సమ సప్తకం ఏర్పడడం అరుదైన విశేషం. ఈ గ్రహాల యుతి వల్ల మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి కొన్ని అదృష్టాలు పట్టబోతున్నాయి.

  1. మేషం: ఈ రాశికి పంచమ, లాభస్థానాల్లో శని చంద్రులు, రవి బుధుల మధ్య సమ సప్తకం ఏర్పడినందు వల్ల ఈ రాశివారి జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా అనూహ్యమైన విజయాలు సిద్ధిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ సమ సప్తక యోగాలు చోటు చేసుకున్నందువల్ల గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. ఒకటి రెండు రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. పలుకుబడి, ప్రాబ ల్యం కలిగిన వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న బుధ రవులతో శని చంద్రులకు సమ సప్తకం ఏర్పడినందువల్ల జీవితం ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో అధిపతి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందడానికి అవ కాశాలు ఏర్పడడమే కాకుండా విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  4. తుల: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో ఈ సమ సప్తకం చోటుచేసుకుంటున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ ప్రయ త్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయంలో సంచారం చేస్తున్న శని చంద్రులతో భాగ్య స్థానంలో ఉన్న రవి బుధులకు సప్తమ దృష్టి ఏర్పడినందువల్ల ఎక్కువగా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు సంభవిం చడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. విదేశీ అవకాశాలు ఎక్కువ సంఖ్యలో అందివస్తాయి. దాదాపు పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి విలువైన ఆస్తి చేతికి అందుతుంది.
  6. కుంభం: ఈ రాశిలో శని చంద్రులు, సప్తమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఈ రాశివారికి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు విస్తరిస్తాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధి స్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలి తాలనిస్తాయి. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.