Horoscope Today: వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 12, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశివారు ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 12th September 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 12, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 12, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృషభ రాశివారు ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబంలో కొందరు బంధువులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నా ప్రతిఫలానికి లోటుండదు. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ప్రతి పనినీ, ప్రతి వ్యవహారాన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితం ఊపందుకుంటుంది. ఉద్యోగంలో అనుకూల తలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో మీ ప్రత్యేకతను, సమర్థతను నిరూపించుకుంటారు. మిత్రుల మీద వృథా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అదృష్టం పడుతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అష్టమ శని ప్రభావం కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ప్రయాణాల్లో లాభాలు కలుగుతాయి. వ్యాపా రాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ జీవితం సరదాగా గడి చిపోతుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పని, ప్రతి ప్రయత్నంలోనూ తప్పకుండా కార్యజయం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాల్లో వేగం పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని కొత్త ప్రయత్నాలు చేపడతారు. సన్ని హితుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం అంది స్తారు. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితం బిజీ అవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. వైద్య ఖర్చులకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో మీ పనితీరు, సమర్థత పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇతర ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకా లున్నా పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ లాభాలు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కా రమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగం మారే విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఆశా జనకంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సాఫీగా పూర్తవుతాయి. మిత్రుల వివాదాలకు దూరంగా ఉండ డం మంచిది. పెళ్లి ప్రయత్నాలో సానుకూల సమాచారం అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందు తాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో శ్రమను మించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభించే అవ కాశం ఉంది. చేపట్టిన పనులన్నీ వేగంగా, తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కొన్ని శుభవార్తలు వింటారు.

కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికొచ్చిన యువతి.. CT స్కాన్ చేయగా..
కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికొచ్చిన యువతి.. CT స్కాన్ చేయగా..
ప్రభాస్ సినిమాలో మెగాస్టార్..
ప్రభాస్ సినిమాలో మెగాస్టార్..
BSNL మరో ముందడుగు.. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టేందుకు కొత్త ఫీచర్
BSNL మరో ముందడుగు.. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టేందుకు కొత్త ఫీచర్
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు..ఫుల్ లిస్ట్
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు..ఫుల్ లిస్ట్
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
అబ్బురపరుస్తోన్న సూక్ష్మ కళాకారుడి ప్రతిభ..పెన్సిల్‌పై నవ దుర్గలు
అబ్బురపరుస్తోన్న సూక్ష్మ కళాకారుడి ప్రతిభ..పెన్సిల్‌పై నవ దుర్గలు
కన్నోళ్లు ప్రేమను కాదన్నారనీ..సొంతకుటుంబంలో 13మందిని చంపిన కూతురు
కన్నోళ్లు ప్రేమను కాదన్నారనీ..సొంతకుటుంబంలో 13మందిని చంపిన కూతురు
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
కావ్యకు ఛాలెంజ్ విసిరిన అపర్ణ.. చిచ్చు రాజేసిన రుద్రాణి..
కావ్యకు ఛాలెంజ్ విసిరిన అపర్ణ.. చిచ్చు రాజేసిన రుద్రాణి..
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్