Horoscope Today: ఈ రాశివారికి ఆస్తి లాభం ఉంటుంది.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం..!

Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే..

Horoscope Today: ఈ రాశివారికి ఆస్తి లాభం ఉంటుంది.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం..!
Rasi Phalalu
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2021 | 7:13 AM

Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరీ ఈరోజు (సెప్టెంబర్‌ 3) ఏఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి:

ఆ రాశివారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. వ్యాపారాలు నెమ్మదిగా కొనసాగుతాయి.

వృషభ రాశి:

వ్యాపారాలలో విజయం సాధిస్తారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తిలాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.

మిథున రాశి:

వ్యాపారాలు, ఇతర వ్యవహారాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలుంటాయి. కుటుంబాలలో తగాదాలు చోటు చేసుకునే అవకాశం.

కర్కాటకరాశి:

చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. ఆస్తి, ధనలాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి.

సింహ రాశి:

చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. బాధ్యతలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు.

కన్య రాశి:

నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

తుల రాశి:

ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు కలుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చిక రాశి:

వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో కలహాలు. అనారోగ్యంతో ఇబ్బందులు పడతారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో వివాదాలు తలెత్తుతాయి.

ధనుస్సురాశి:

కుటుంబసభ్యులతో తగాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టే పనుల్లో జాప్యం ఏర్పడుతుంది.

మకర రాశి:

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభ రాశి:

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

మీన రాశి:

వ్యాపారాల విషయాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

ఇవీ కూడా చదవండి:

Chanakya Niti: నాయకుడిగా ఉండాలంటే.. ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి.. అవేంటంటే!

Tirumala: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి మరో ప్రసాదం.. సరికొత్తగా ‘ధన ప్రసాదం’

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్