Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులు..!

Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే..

Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2021 | 6:06 AM

Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరీ శనివారం (సెప్టెంబర్‌ 4) ఏఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి:

మీమీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. అనవసరమైన ఆలోచనలు దరి చేరనీయకుండా చూసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:

చేపట్టే పనుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

మిథున రాశి:

ఈ రాశివారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి:

గో సేవ చేయడం వల్ల ఈ రాశివారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. గిట్టనివారి జోలికి వెళ్లకపోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసే అవకాశం

సింహ రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.

కన్యరాశి:

అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కీలక లావాదేవీల విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన పనులను చేపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

తుల రాశి:

ధనవ్యయం కలుగుతుంది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.

వృశ్చిక రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

ధనుస్సు రాశి:

అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి.

మకర రాశి:

బుద్దిబలంలో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.

కుంభ రాశి:

చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీన రాశి:

ముఖ్యమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. అందరిని కలుపుకొని వెళ్లడం మంచిది. ప్రయాణాల విషయాలలో అజాగ్రత్తగా వహించవద్దు. నిరుద్యోగులకు మంచి ఫలితాలు.

ఇవీ కూడా చదవండి:

Pooja with Flowers: పనిలో విఘ్నాలు తొలగాలన్నా, సరస్వతి కటాక్షం కలగాలన్నా ఏ దేవుడిని, ఏ పువ్వులతో పూజించాలంటే

Natural Three Laws: ప్రకృతిని అర్ధం చేసుకుని… పెద్దలు చెప్పిన మూడు నియమాలు..అవి పాటిస్తే..జీవితం సంతోషమయం..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!