Horoscope Today: ఆ రాశివారు చేపట్టిన పనులన్నీ సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 22, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పదోన్నతికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో తొందరపాటుతనంతో వ్యవహరించే ప్రమాదం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రతిఫలానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు విజయాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 2,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడం జరు గుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం మంచిది కాదు. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆహార, విహా రాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం బాగాఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఏ వృత్తిలో ఉన్నా రాబడి పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులున్నా లాభాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థికంగా మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫ లితాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక, కుటుంబ సమస్యలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగం హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపా రాలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.



