Ruchaka Yoga: అరుదైన యోగంతో వారు అపర కుబేరులయ్యే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా?
Ruchaka Maha Purusha Yoga: జ్యోతిషశాస్త్రంలో పంచ మహా పురుష యోగాలలో ఒకటైన రుచక యోగానికి చాలా ప్రధాన్యత ఉంది. కుజుడు తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఈ యోగం కలుగుతుంది. ఈ యోగం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. వారికి సంపద, అధికారం, ఉన్నత స్థానాలు, కెరీర్‌లో పురోగతిని అందిస్తుంది.

జ్యోతిషశాస్త్రంలో పంచ మహా పురుష యోగాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. శశ, హంస, మాలవ్య, భద్ర, రుచక యోగాలనే ఈ అయిదు మహా పురుష యోగాల్లో ఏ ఒక్క యోగం పట్టినా వారు రారాజులు, అపర కుబేరులు అవుతారని, తమ తమ రంగాల్లో అగ్రస్థానాలకు చేరుకుంటా రని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శనిని బట్టి శశ యోగం, గురువును బట్టి హంస యోగం, శుక్రుడిని బట్టి మాలవ్య యోగం, బుధుడిని బట్టి భద్ర యోగం, కుజుడిని బట్టి రుచక యోగం కలుగుతాయి. ప్రస్తుతం కుజుడు తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల రుచక మహా పురుష యోగం(Ruchaka Maha Purusha Yoga) కలుగుతోంది. ఈ రాశిలో కుజుడు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7 వరకు సంచారం చేయబోతున్నాడు. స్వస్థానంలో ఉన్న కుజుడు ఏ రాశికైనా 1, 4, 7, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు వారికి రుచక యోగం కలుగుతుంది. వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ఈ యోగం కలిగింది.
- వృషభం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో కుజుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల రుచక యోగం కలి గింది. అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల సంపన్న వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం తప్పకుండా జరుగుతుంది. వైవాహిక సమస్యలన్నీ పరిష్కారమై, అన్యోన్యత పెరుగుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- సింహం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడు స్వస్థాన ప్రవేశం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్ప డింది. ఈ యోగం వల్ల వీరికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నాకలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. సిరిసంపదలతో తులతూగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి లాభం కలుగుతుంది.
- వృశ్చికం: కుజుడికి ఇది స్వక్షేత్రం. ఈ రాశిలో కుజుడికి రుచక మహా పురుష యోగం కలుగుతుంది. ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రాబల్యం, ప్రాధాన్యం కలుగుతాయి.
- కుంభం: ఈ రాశికి దశమ కేంద్రంలో కుజుడి స్వస్థాన స్థితి వల్ల రుచక మహా పురుష యోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థను నెలకొల్పే అవ కాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక విదేశీ ఆఫర్లు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.



