AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: నాలుగు గ్రహాల యుతి.. ఆ రాశులకు కనీవినీ ఎరుగని ధన యోగాలు..!

ఫిబ్రవరి 13 నుంచి మార్చి 17 వరకు రవి, బుధ, శుక్ర, రాహు గ్రహాల యుతి ప్రత్యేక ఫలితాలను ఇవ్వనుంది. గురువు దృష్టి కూడా ఉండటంతో మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ఆకస్మిక ధనప్రాప్తి, శుభయోగాలు కలగనున్నాయని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది.

Money Astrology: నాలుగు గ్రహాల యుతి.. ఆ రాశులకు కనీవినీ ఎరుగని ధన యోగాలు..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 6:15 PM

Share

ఈ నెల(ఫిబ్రవరి) 13 నుంచి మార్చి 17 వరకు కుంభ వృషభ రాశిలో నాలుగు గ్రహాల యుతి జరగబోతోంది. రవి, బుధ, శుక్ర, రాహువులు కలవడం వల్ల కొన్ని రాశులవారికి కలలో కూడా ఊహించని శుభ యోగాలు కలగబోతున్నాయి. పైగా ఈ నాలుగు గ్రహాల కూటమిని గురువు కూడా వీక్షించడం వల్ల ఈ రాశులవారికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. ఈ గ్రహ కలయిక వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులకు కనీవినీ ఎరుగని ధన యోగాలు పట్టబోతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలగడంతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో నాలుగు గ్రహాల యుతి జరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగపరంగా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరగడంతో పాటు రాబడి అంచనాల్ని మించుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు దశమ స్థానంలో చేరడం వల్ల జీవనశైలి మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. రాజకీయ ప్రముఖులతో, ఉన్నత వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
  3. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం మహాభాగ్య యోగాన్ని కలుగజేస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. పిత్రార్జితంతో పాటు వారసత్వ సంపద లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  4. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో నాలుగు శుభ గ్రహాలు కలవడం, అందులో రాశ్యధిపతి శుక్రుడు కూడా ఉండడం వల్ల రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో విపరీత రాజయోగాన్ని కలుగజేస్తుంది. మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలపరంగా తిరుగుండదు. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆస్తులు, ఆదాయాలు కలిసి వస్తాయి.
  5. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  6. కుంభం: ఈ రాశిలో నాలుగు శుభ గ్రహాల కలయిక వల్ల ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో జీవితం బాగా మారిపోయే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి.