Rahu Ketu Transit: త్వరలో రాశిని మార్చుకోనున్న రాహుకేతువులు.. ఈ రెండు రాశులవారికి 18 నెలలు అష్టకష్టాలే.. కొన్ని పరిహారాలు మీ కోసం
జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో రాహు కేతువులు ఛాయా గ్రహాలు. ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు రంగు నలుపు.. కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. రాహు-కేతువులు ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే ప్రయాణిస్తాయి. ఇవి 18 నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మారుతాయి. త్వరలో మే 18వ తేదీన జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకేతువులు తమ రాశిని మార్చుకోనున్నాయి. ఈ రాశి మార్పువలన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే.. మరికొన్ని నష్టాలను తెస్తాయి. ఈ రోజు రాహు కేతు వలన కష్టాలు పడే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

నవ గ్రహాల్లో రాహు కేతు గ్రహాలు నీడ గ్రహాలు. శనిశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ రాహు కేతు గ్రహాలు 18 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటాయి. ప్రస్తుతం మీన రాశిలో రాహువు ఉన్నాడు. కన్య రాశిలో కేతువు ఉన్నాడు. కాగా మే 18, 2025న రాహువు .. శనీశ్వరుడు అధిపతి అయిన కుంభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. అదే సమయంలో కేతువు సూర్యుడు అధిపతి అయిన సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఇక్కడ 18 నెలల పాటు ఉంటాడు. ఈ గ్రహాల సంచారంతో మొత్తం రాశులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. రాహు కేతువుల ప్రభావం వలన శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, కుటుంబ సంబంధాలు, కర్మ, విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతాయి. కొందరిపై చెడు ప్రభావాన్ని చూపిస్తే.. మరికొందరికి అదృష్టాని తీసుకొస్తాయి. అయితే ఈ రోజు ఏ రాశులపై రాహు కేతువు చెడు ప్రభావం చూపిస్తుంది.. పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..
రాహు కేతువులు తిరోగమన దిశలో (వ్యతిరేక దిశ) ప్రయాణిస్తాయి. మే 18న రాశిని మార్చుకున్న తర్వాత రాహు కేతువులు డిసెంబర్ 5వ తేదీ 2026 వరకు ఆ రాశిలోనే ఉండనున్నారు. దీంతో కొన్ని రాశులకు లాభాలు.. కొన్ని రాశులకు కష్టాలు తీసుకుని రానున్నాయి.
ఏ రాశుల వారికి లాభం?
రాహువు కేతువులు 2025 మే 18న తమ రాశిని మార్చుకోవడం వలన మీన, కన్య రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు 18 నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. మీన, కన్య రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో అనేక సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఆరోగ్య పరంగా కూడా బాగుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు.
ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
కుంభ రాశి: రాహువు మే 18న కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటి పదిసార్లు ఆలోచించాలి. దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్య పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురవుతారు. 18 నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. వీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి అడుగు వెయ్యాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఈ నివారణ చర్యలతో కొంత మేర ఉపశమనం.. రాహు కేతు మంత్రాలు
ఈ రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతువులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలి. రాహు కేతువుకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. రాహువు పతికూలత తగ్గించేందుకు ఓం రాం రహవే నమః అనే మంత్రం పటించాలి. కేతువు నుంచి రక్షణ పొందేందుకు “ఓం కేం కేతవే నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాలను జపించడం వలన రాహు కేతు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.