Monthly Horoscope (March 2023): మార్చినెలలో ఆ రాశులవారి ఆర్థిక కష్టాలు తీరిపోతాయి.. 12 రాశులకు మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మార్చి 1 నుంచి మార్చి 31, 2023 వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి అదృష్ట యోగం, అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు సంపాదించే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ వచ్చు, ఎవరినైనా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబంలో ప్రశాంత, సామరస్య వాతావరణం నెలకొంటుంది. సమస్య ఒకటి చిన్న ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. వృత్తి జీవితంలో కొద్దిగా మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. శుభకార్యాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దైవకార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే సూచనలు ఉన్నాయి. ఒకరిద్దరు స్నేహితులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. అలుపు సొలుపు లేకుండా ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒకరిద్దరికి వీలైనంతగా సహాయం చేస్తారు. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నిపుణులు కొత్త ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు మంచి కబురు అందే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మంచి అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసు కుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల దీనిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. బాగా తిప్పట, శ్రమ ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు పూర్తి అయి మనశ్శాంతి కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా చాలా వరకు ఉపశ మనం కలగవచ్చు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల శాతం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ప్రయోగాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పరిచయస్తుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ రావచ్చు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత కాలం పాటు ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. ఆర్థికంగా మీ మీద ఎక్కువగా ఆధారపడేవారు ఉంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో సహచరుల నుంచి సహకారం లభించకపోవచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. వృత్తి నిపుణుల మీద పని భారం పెరుగుతుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. మొండి బాకీ ఒకటి కొద్ది ప్రయత్నంతో వసూలు అయ్యే సూచనలు ఉన్నాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రేమ జీవితం కొద్దిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ నెల అంతా హ్యాపీగా, ప్రశాంతంగా గడిచి పోతుంది. ఉత్తర నక్షత్రం వారు కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తనకు మాలిన ధర్మం పనికిరాదని అర్థం చేసుకోండి. ఉద్యోగంలో అతిగా పని చేయడం వల్ల శారీరక ఇబ్బందులు ఎదుర్కో వలసి రావచ్చు. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ రావటం, ఇంక్రిమెంట్ పెరగటం వంటివి జరగవచ్చు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. డాక్టర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులు బిజీ అయిపోయే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేయడానికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు శుభ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వృత్తిరీత్యా దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు లేదా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ పరంగా ఒత్తిడి పెరిగి మనశ్శాంతి తగ్గుతుంది. ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యులను లేదా జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఉండటం కానీ చేయవద్దు. ఇరకాట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో ఇబ్బందులు తలెత్తు తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి వ్యాపారాలతో పాటు ఉద్యోగ జీవితం కూడా సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా ఒడి దుడుకులు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో కొందరు మీ మీద అభాండాలు, అపనిందలు వేసే అవకాశం ఉంది. అందరినీ గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు. కొందరి కారణంగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ కార్యాల్లో నిమగ్నం అవుతారు. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఎదురవుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ జీవితం ఇబ్బందులకు లోనవుతుంది.
ధనుస్సు(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆశించినంతగా పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. స్నేహితులతో విందులు, వినోదాలు పాల్గొంటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది కానీ, వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విపరీతంగా శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. శరీరానికి విశ్రాంతి లభించడం కూడా కష్టం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయపరంగా మంచి పురోగతి కనిపిస్తోంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. శ్రద్ధాసక్తులు పెంచుకోవాల్సి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా మాత్రమే సఫలం అవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. బంధువుల ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ప్రేమ జీవితం నిరుత్సాహం కలిగిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులతో, ఊహించని ఖర్చులతో ఇబ్బందిపడటం జరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. నిర్విరామంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను చేజిక్కించుకుంటారు. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ఐ టి వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరు ద్యోగులకు మంచి కబురు అందుతుంది. విద్యా ర్థులకు శ్రమ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ప్రయాణాల వల్ల ఫలితం ఉండకపోవచ్చు. చుట్టుపక్కల వారితో విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. ప్రేమ జీవితం సాఫీగా సాగక పోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు ఆదాయం పెరుగుతుంది. రాదని వదిలేసుకున్న బకాయి ఒకటి చిన్న ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఇతరులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన మెరుగు పడుతుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలు పాటించి ప్రయోజనం పొందుతారు. ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మున్ముందు శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..