Horoscope Today (Feb 28, 2023): ఆ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశులవారి దినఫలాలు..
Daily Horoscope Today: 12 రాశుల వారికి మంగళవారం (ఫిబ్రవరి 28న) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సంపాదనపరంగా రోజంతా బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు సంతృప్తి కరంగానే ఉంటాయి. అనుకోకుండా కొద్దిగా డబ్బు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆచి తూచి మాట్లాడడం మంచిది. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభించవచ్చు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులు వేగంగా పూర్తయిపోతాయి. మానసికమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
చిన్న పనికి కూడా బాగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడటం జరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. కుటుంబానికి సంబం ధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్త వినే సూచనలు ఉన్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగరీత్యా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సజావుగా, సాఫీగా సాగిపోతాయి. లాభాలకు ఏమాత్రం లోటు ఉండదు. పిల్లలు ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. స్నేహితుల సహాయంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. వ్యాపారులకు అనుకోకుండా ఆర్థిక భారం పెరుగుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు నిరీక్షణ తప్పదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2,)
ఈ రాశి వారికి రోజంతా ప్రశాంతంగా గడిచి పోతుంది. మానసిక ప్రశాంతత కూడా ఏర్పడు తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఒక కుటుంబ సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. విద్యా ర్థులు అతి తేలికగా విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ నుంచి గతంలో సహాయం పొందిన వారు మీకు దూరం అవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. ఒంటెద్దు పోకడ మంచిది కాదు. నిరుద్యోగులు ఒక చిన్న ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా కనిపిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కుటుంబంలో ఒకటి రెండు చికాకులు తలెత్తుతాయి. ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఊహించని విధంగా చిన్నపాటి అదృష్టం పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సునాయాసంగా పూర్తవుతాయి. బంధువులకు ఉపయోగపడే పనులు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కింది ఉద్యోగులకు అండగా నిలబడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులు మీ మీద అతిగా ఆధారపడటం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల శాతం బాగా పెరుగుతుంది. సాంకేతిక నిపుణులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో శ్రద్ధ పెంచడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి యధాతధంగా కొనసాగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు చిన్న ఉద్యో గంతో సరిపెట్టుకోవడం జరుగుతుంది. ఆహార విధానాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనుల విషయంలో బద్ధకించడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. మొండి బాకీ ఒకటి వసూలు అయి అవసరాలు తీరుతాయి. ఐటి నిపుణులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.