AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today (March 01, 2023): ఆ రాశివారికి కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశులకు దినఫలాలు..

Daily Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం (మార్చి 1న) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 01, 2023): ఆ రాశివారికి కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశులకు దినఫలాలు..
HoroscopeImage Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2023 | 4:19 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా కొనసాగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు బాగా ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్థిస్తారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహకారంతో పరిష్కారం అవుతుంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు అన్ని విధాల కలిసి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ సమస్య తగ్గుతుంది. పెళ్లి సంబంధం కాయం అవుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా పర్వాలేదు. వృత్తి నిపుణులు నిలదొక్కుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఐటీ రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొందరు బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరులకు బాగా సహాయపడతారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. స్నేహితులు అండగా నిలుస్తారు. బంధువర్గంలో మీ  మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా లాభాలు సంపాదిస్తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో సహచరుల పనులను కూడా మీరే పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మితిమీరిన ఔదార్యంతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మితిమీరిన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఆదాయంలో కొద్దిగా మాత్రమే పెరుగుదల ఉంటుంది. ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒకరిద్దరు స్నేహితులను ఆదుకుంటారు. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఒక బంధువు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం బాగుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఏదో విధంగా నెట్టుకొస్తారు. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కొన్ని బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. అనుకున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

Follow Us