Lunar Eclipse 2024: హొలీ రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులపై ప్రభావం.. అత్యంత కష్ట సమయం..
జ్యోతిష్యుల ప్రకారం సనాతన ధర్మంలో చంద్రగ్రహణం అశుభకరమైనది చర్యగా పరిగణించబడుతుంది. గ్రహణం ప్రతికూల శక్తిని తెస్తుందని.. అన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. కనుక గ్రహణ సమయంలో అన్ని రాశుల వారు ఆందోళన చెందుతారు. అయితే గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. అదే సమయంలో ఈసారి చంద్రగ్రహణం అనేక రాశుల వారికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
హిందూ సంప్రదాయంలో గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. ఈ ఏడాది 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న సంభవించనుంది. రాహు, కేతువుల వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. వాస్తవానికి ఈ రెండు అ శుభ గ్రహాలు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తాయని అందుకనే చంద్రగ్రహణం ఏర్పడుతుందని విశ్వాసం.
జ్యోతిష్యుల ప్రకారం సనాతన ధర్మంలో చంద్రగ్రహణం అశుభకరమైనది చర్యగా పరిగణించబడుతుంది. గ్రహణం ప్రతికూల శక్తిని తెస్తుందని.. అన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. కనుక గ్రహణ సమయంలో అన్ని రాశుల వారు ఆందోళన చెందుతారు. అయితే గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. అదే సమయంలో ఈసారి చంద్రగ్రహణం అనేక రాశుల వారికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి చంద్రగ్రహణ ఖచ్చితమైన సమయం, ఏ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావితం చూపించనుందో తెలుసుకుందాం
వృశ్చిక రాశి: హొలీ రోజున ఏర్పడనున్న చంద్ర గ్రహణం ఈ రాశివారికి అశుభయోగం. ఈ రాశికి చెందిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో మార్పులు జరగనున్నాయి.
మిథునరాశి: ఈ ఏడాది హొలీ రోజున ఏర్పడే చంద్ర గ్రహణం మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ సమయంలో ఒత్తిడికిలోనవుతారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో జీవిత భాగస్వామితో వివాదాలు, అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి: ఏడాదిలో ఏర్పడే మొదటి చంద్రగహణం సింహ రాశివారికి కూడా తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తుంది. ఈ సమయం ఒత్తిడితో కూడుకున్నది. వ్యాపారం రంగంలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోనవకుండా ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు