Lucky Stars: మూడు గ్రహాలకు బలం.. ఇక ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి అదృష్టమే అదృష్టం..!
Nakshatra Astrology: ప్రస్తుతం గురువు, శుక్రుడు, కుజుడు బలంగా ఉన్నందున పునర్వసు, విశాఖ, మృగశిర, భరణి, పూర్వాభాద్ర వంటి కొన్ని నక్షత్రాల వారికి అద్భుత అదృష్టం, ధన లాభాలు పడుతున్నాయి. ఈ గ్రహ సంచారాల వలన వృత్తిలో పురోగతి, పదోన్నతులు, ఆస్తి వృద్ధి, ఆరోగ్య మెరుగుదల, విదేశీ అవకాశాలు వంటి అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ నక్షత్రాల వారికి రాజయోగాలు, ధన యోగాలు ప్రాప్తించే అవకాశం ఉంది.

Lucky Stars
Lucky Nakshatras: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ సంచారం మీద నక్షత్రాల ప్రాధాన్యం, అదృష్టం వంటివి ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం గురువు, శుక్రుడు, కుజుడు బలంగా ఉన్నందు వల్ల ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. గురువుకు చెందిన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు, కుజుడికి చెందిన మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలు, శుక్రుడికి చెందిన భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఒక వెలుగు వెలగబోతున్నారు. ఈ నక్షత్రాల వారికి అనేక విధాలైన అదృష్టాలు కలిగే అవకాశం ఉంది.
- భరణి: శుక్రుడికి సంబంధించిన ఈ నక్షత్రం మేష రాశిలో ఉన్నందువల్ల ఈ ఏడాదంతా ఈ రాశివారికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 3 నుంచి సొంత తులా రాశిలో సంచారం చేయడం వల్ల ఈ నక్షత్రం వారికి యోగదాయ కంగా సాగిపోతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- మృగశిర: ఈ నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారి దశ తిరుగుతుంది. జీవన శైలి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా బాగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ది చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
- పునర్వసు: ఈ నక్షత్రానికి అధిపతి అయిన గురు గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారికి ఈ ఏడాదంతా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఈ నక్షత్రానికి చెందినవారు తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరి ష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
- పుబ్బ: ఈ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 3 నుంచి స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల ఈ నక్షత్రం వారికి అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచ నాలకు మించిన లాభాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరు గుతాయి. ధనపరంగా జాగ్రత్తలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉన్నత స్థితిలో ఉంటుంది.
- చిత్త: కుజుడికి చెందిన ఈ నక్షత్రం వారికి అపార ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిం దల్లా బంగారం అవుతుంది. కుజుడు ప్రస్తుతం తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో సంచారం చేస్తు న్నందువల్ల నవంబర్ ఆఖరు లోగా వీరికి ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- విశాఖ: గురు గ్రహం అధిపతిగా ఉన్న ఈ నక్షత్రానికి చెందిన వారు ఈ ఏడాది ఒక వెలుగు వెలగబోతు న్నారు. గురువు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారి జీవితం ఉజ్వలంగా సాగిపోతుంది. ఈ నక్షత్రం వారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఒక సంస్థకు ఉన్నతాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది.
- పూర్వాషాఢ: ఇది శుక్ర గ్రహానికి సంబంధించిన నక్షత్రం అయినందువల్ల ఈ నక్షత్రానికి చెందినవారికి ఊహిం చని రాజయోగాలు కలగబోతున్నాయి. రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదా యం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
- ధనిష్ఠ: ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ గ్రహం ప్రస్తుతం సొంత రాశి వృశ్చికంలో సంచారం చేస్తున్నం దువల్ల ఈ నక్షత్రానికి బలం పెరిగింది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సీనియర్లను కాదని ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
- పూర్వాభాద్ర: గురువుకు చెందిన ఈ నక్షత్రం వారికి రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. గురువు ప్రస్తుతం ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారికి కూడా దశ తిరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందడంతో పాటు రాజకీయ ప్రాబల్యం కూడా కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. సంతానం కలగడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి







