- Telugu News Photo Gallery Spiritual photos Ashta Aishwaryas are bestowed upon these three zodiac signs in the month of Karthika
కార్తీక మాసంలో అదృష్టం వరించే రాశులివే.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కార్తీక మాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అనుకోని విధంగా 12 రాశుల్లో కొన్ని రాశులకు లక్కు కలిసి వస్తుంది. కాగా, అసలు కార్తీక మాసంలో ఏ రాశుల వారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది. ఏ రాశుల వారికి ఈ మాసం లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Oct 27, 2025 | 5:12 PM

చాలా పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివుని పూజలు చేస్తూ శివారాధన చేస్తుంటారు. 2025వ సంవత్సరంలో అక్టోబర్ 21 నుంచి కార్తీక మాసం మొదలై, నవంబర్ 20న ముగుస్తుంది.

అయితే ఈ సమయంలో చాలా మంది తీర్థయాత్రలు చేయడం, శివాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేయడం, చేస్తుంటారు. అయితే ఈ మాసంలో కొన్ని రాశుల వారు పూజలు చేయకున్నా వారిపై ఆ పరమేశ్వరుడు, తన అనుగ్రహాన్ని అందించనున్నాడంట. దీంతో వారికి పట్టిందల్లా బంగారమే కానున్నది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ కార్తీక మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థి చాలా బాగుటుంది. అంతే కాకుండా వీరికి వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. కుటుంబంలోని సమస్యలు తొలిగిపోయి చాలా సంతోషంగా ఉంటారు.

తుల రాశి : ఈ రాశి వారికి ఈ మాసంలో రాజ్యపూజ్యం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా, వీరు కుటుంబ సభ్యులతో శివాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరి, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

మకర రాశి : ఈ మాసం మొత్తం వీరికి అత్యద్భుతంగా ఉండబోతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం ఖాయం.



