- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: If you have these plants in your house, you will never have any problems!
వాస్తు టిప్స్ : ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే అప్పుల బాధలే ఉండవు!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంది వాస్తు సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను ఇంటిలో నాటుకోవడం వలన అప్పుల బాధ నుంచి బయటపడతారంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 27, 2025 | 4:59 PM

వాస్తు శాస్త్రంం అనేవి కుటుంబంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇళ్లు సరైన దిశలో లేకపోయినా, ఇంటిలోపల వాస్తు నియమాలు పాటించకపోయినా, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు వాస్తు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో గనుక బాధపడుతున్నట్లు అయితే తప్పకుండా ఈ మొక్కలను మీ ఇంటిలోపల నాటండి.

బంతిపువ్వు మొక్క : బంతి పువ్వులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇంటిలో నాటడం వలన ఇంటికి అందమే కాకుండా వాస్తు కూడా కలిసి వస్తుందంట. ఈ మొక్కలు ఎవరైతే వారి ప్రధాన ద్వారం వద్దనాటుతారో, ఆ ఇంట అప్పుల బాధలే ఉండవు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ అనేది సంపదకు చిహ్నం. ఈ మొక్క ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. అయితే వాస్తు ప్రభావంతో ఎవరైనా అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే వారు ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం మంచిదంట.

వెదురు : లక్కీ వెదురు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఇది ఇంటిలో ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు. అందువలన ఎవరైనా సరే తమ ఇంటిలో లక్కీ వెదురు నాటుకోవడం వలన అప్పుల సమస్యలు తొలిగిపోయి, ఇంటిలోపల సంపద పెరుగుతుందంట.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



