AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nov 2025 Lucky Zodiacs: మూడు అరుదైన యోగాలు.. నవంబర్ నెలలో నక్కతోక తొక్కబోయే రాశులివే..!

నవంబర్‌లో ఏక కాలంలో మూడు అరుదైన యోగాలు చోటు చేసుకోబోతున్నాయి. జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్న అయిదు మహా పురుష యోగాల్లో మూడు మహా పురుష యోగాలు నవంబర్ లోనే సంభవించడం నిజంగా అరుదైన విషయం. దీని వల్ల కొన్ని రాశుల వారు ఊహించని స్థాయిలో అదృష్టవంతులు కాబోతున్నారు. గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం, కుజుడు తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల రుచక మహా పురుష యోగం, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య మహా పురుష యోగం సంభవిస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు నక్కతోకను తొక్కడం ఖాయమని చెప్పవచ్చు.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 26, 2025 | 7:32 PM

Share
మేషం: ఒక్క మహా పురుష యోగంతోనే ఏ రాశివారైనా అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి హంస మహా పురుష యోగంతో పాటు మాలవ్య మహా పురుష యోగం కూడా పడుతు న్నందువల్ల వీరికి ఇక పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. విదేశాల నుంచి కూడా అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. రాశ్యధి పతి శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల కూడా ఈ రాశివారికి ఊహించని అదృష్టాలు కలుగుతాయి. రుచక మహా పురుష యోగం పట్టడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. విదేశీ సంస్థలకు ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం, చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగాయి. ఈ రాశివారు అన్ని రకాల కష్టనష్టాల నుంచి బయటపడి ‘శుభ శోభన’ యోగాలు అనుభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు తప్పకుండా జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

3 / 6
తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు సంచారం చేయడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతుండగా, దశమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రెండు మహా యోగాల వల్ల వీరు ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందడం, రాజకీయ ప్రాబల్యం కలగడం, అధికార యోగం పట్టడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అత్యంత సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశిలో రాశినాథుడు కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం కలగడం ఒక విశేషం కాగా, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం మరో విశేషం. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు అత్యంత సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం, దశమ స్థానంలో శుక్రుడి స్థితి వల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగాయి. ఈ రెండు యోగాల కార ణంగా ఈ రాశివారు అందలాలు ఎక్కడం, అత్యంత ప్రముఖులకు సన్నిహితం కావడం, సంపన్నుల కోవలో చేరడం ఖాయం. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..