Crorepati Yoga: త్వరలో ఆ రాశుల వారికి కోటీశ్వర యోగం! ఉద్యోగ పదోన్నతులు, జీతాల పెంపు
గురువు, కుజుడు, శుక్రుడు గ్రహాల అనుకూల సంచారంతో త్వరలోనే ఐదు రాశుల వారికి అపార ధనయోగం పట్టనుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలు పెరగడం, వ్యాపార లాభాలు, ఆస్తుల వృద్ధి ద్వారా కోటీశ్వరులయ్యే అవకాశాలున్నాయి. షేర్లు, ఆస్తి వివాదాలు కూడా అనుకూలంగా మారుతాయి. వీరికి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఈ ఐదు రాశుల వారు ఎవరెవరో ఇక్కడ చూద్దాం.

Crorepati Yoga
Wealth Astrology: ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, కుజుడు ఈ నెల(అక్టోబర్) 28 నుంచి, శుక్రుడు నవంబర్ 3 నుంచి స్వస్థానాల్లో సంచారం చేయడం వల్ల డిసెంబర్ 5వ తేదీ లోగా అయిదు రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులు కాబోతున్నారు. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గడించే అవకాశం ఉంది. వీరికి అనేక ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం జరుగుతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానాధిపతి గురువు తృతీయంలో ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి శుక్రుడికి బలం కలగడం వంటి కారణాల వల్ల ఆదాయం క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం, సంపద వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించుతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం, శుక్రుడు చతుర్థంలో, కుజుడు పంచమంలో సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధికి అవకాశముంది.
- తుల: ఈ రాశికి గురువు దశమ స్థానంలో ఉచ్ఛపట్టినందువల్ల, రాశ్యధిపతి శుక్రుడు, ధన స్థానాధిపతి కుజుడు స్వస్థానాల్లో ప్రవేశించడం వల్ల ఆదాయపరంగా ఈ రాశివారి అదృష్టం కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల, రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో ప్రవేశించడం వల్ల అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆస్తుల విలువ బాగా మించి పెరుగుతుంది. గృహ యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు బాగా ఆదాయం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి.
- మకరం: ఈ రాశికి సప్తమంలో గురువు ఉచ్ఛపట్టడం, దశమ స్థానంలో దశమాధిపతి శుక్రుడు, లాభ స్థానంలో లాభాధిపతి కుజుడు ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ప్రభుత్వ మూలక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది.



