Lord Shani Dev: శనీశ్వరుడికి ఇక పూర్తి బలం! తనకు ఇష్టమైన ఆ రాశుల వారిపై వరాల వర్షం
ఈ నెల 18 (సోమవారం)తో శని అస్తంగత్వ దోషం నుంచి బయటపడుతున్నందువల్ల శని పూర్తి బలంతో తనకిష్టమైన రాశుల మీద వరాల వర్షం కురిపించే అవకాశం ఉంది. రవితో సంయోగం వల్ల శనీశ్వరుడికి దాదాపు నెల రోజుల పాటు అస్తంగత్వ (దహనమైపోవడం) దోషం ఏర్పడింది. రవి కుంభరాశిని వదిలిపెట్టి మీన రాశికి వెళ్లిపోవడంతో శనికి అస్తంగత్వ దోషం వదిలిపోయింది.
ఈ నెల 18 (సోమవారం)తో శని అస్తంగత్వ దోషం నుంచి బయటపడుతున్నందువల్ల శని పూర్తి బలంతో తనకిష్టమైన రాశుల మీద వరాల వర్షం కురిపించే అవకాశం ఉంది. రవితో సంయోగం వల్ల శనీశ్వరుడికి దాదాపు నెల రోజుల పాటు అస్తంగత్వ (దహనమైపోవడం) దోషం ఏర్పడింది. రవి కుంభరాశిని వదిలిపెట్టి మీన రాశికి వెళ్లిపోవడంతో శనికి అస్తంగత్వ దోషం వదిలిపోయింది. ఫలితంగా శనీశ్వరుడు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు పూర్తి బలంతా సంపదనివ్వడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కెరీర్ లో ముందుకు తీసుకు వెళ్లడం, మనసులోని కోరికలు నెరవేర్చడం వంటివి జరుగుతాయి. ఈ ఏడాది చివరి వరకు శనీశ్వరుడు మళ్లీ యోగదాయక గ్రహంగా వ్యవహరించడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడికి ప్రాణ స్నేహితుడైన శనీశ్వరుడు స్వస్థానమైన దశమ స్థానంలో మళ్లీ శుభ సంచారం ప్రారంభించినందువల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా రాజయోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించి పదోన్నతి దక్కే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తున్నవారికి మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శని అస్తంగత్వ దోషం నుంచి బయటపడడంతో ఉద్యోగులకు, నిరుద్యోగులకు అంచనాలకు మించిన అవకాశాలు అంది వస్తాయి. విదేశీ యానానికి, విదేశీ ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పితృమూలక ధన లాభం కలుగు తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగు పరచడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న విహార యాత్రలు, తీర్థయాత్రలకు మార్గం సుగమం అవుతుంది.
- తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు మళ్లీ బలం పుంజుకోవడం వల్ల యత్న కార్యసిద్దికి, వ్యవహార జయానికి బాగా అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. సంపద బాగా పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మనసు లోని ప్రధానమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్టమైన రీతిలో జీవితం గడపడం జరుగుతుంది. పిల్లలు ఆశించిన శుభవార్తలు అందిస్తారు.
- మకరం: ఈ రాశికి పూర్ణ శుభుడైన శనీశ్వరుడు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి.
- కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శనీశ్వరుడు దోషరహితంగా మారినందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి బాగా మారిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.