Horoscope Today: ఆ రాశి వారికి ఒకట్రెండు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫ
దిన ఫలాలు (మార్చి 19, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. 12 రాశుల వారికి ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మంగళవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దిన ఫలాలు (మార్చి 19, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. 12 రాశుల వారికి ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మంగళవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. లాభదాయక ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అధికారులతో సానుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలుంటాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులకు అవకాశం. పిల్లలకు విద్య, ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు బాగా ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొన్ని ముఖ్యమైన పనుల్లో మీరు విజయం సాధిస్తారు. ఇష్టమైన వ్యక్తుల సలహాలతో ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వస్తు వాహనాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందు కుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యో గాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బం దుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవ హారాలు పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి వ్యవహారాలు చక్కబెడతారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందు తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడ తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొందరు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఒకటి రెండు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. మిత్రులతో విలాస జీవితం గడుపుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కాక ఇబ్బంది పడతారు. సోదరులతో అపార్థాలు తలెత్తుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబసమేతంగా ఆలయ సందర్శన చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారయ్యే అవకాశముంది. ఆర్థికంగా మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకరి బద్దరు బంధు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యానికేమీ ఇబ్బంది ఉండదు. జీవిత భాగబ స్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. పిల్లలకు కూడా శుభవార్తలు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాలు విస్తరించే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శి స్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రాదను కుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దా నాలు చేయవద్దు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోయే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగంలో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు బాగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి.