Zodiac Signs: మీన రాశిలో సంచరిస్తున్న రవి.. నెల రోజుల పాటు ఆ రాశుల వారు జాగ్రత్త!
వచ్చే నెల 16వ తేదీ వరకూ మేషం, సింహం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారు రవి గ్రహ సంచారంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రవి గ్రహం వల్ల వీరు కొద్దిగా ఇబ్బందులు పడే సూచనలున్నాయి. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠనం లేదా సుందరకాండ పారాయణం వల్ల రవి దుష్ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
వచ్చే నెల 16వ తేదీ వరకూ మేషం, సింహం, కన్య, తుల, కుంభం, మీన రాశుల వారు రవి గ్రహ సంచారంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రవి గ్రహం వల్ల వీరు కొద్దిగా ఇబ్బందులు పడే సూచనలున్నాయి. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠనం లేదా సుందరకాండ పారాయణం వల్ల రవి దుష్ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి, అధికారానికి, తండ్రికి, రాజకీయాలకు కారకుడైన రవి దుస్థానగతుడైనందువల్ల ఈ రాశుల వారు రకరకాల చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి గ్రహం ప్రస్తుతం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక లాభాలు, ప్రయోజనాలకు ఆటంకాలు ఏర్పడ తాయి. అనవసర వివాదాల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది. ఆహార, విహారాలలో ఎంతో జాగ్ర త్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
- సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి గ్రహం అష్టమ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఏ పనీ పూర్తి కాక, ప్రతి పనీ పెండింగులో పడి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఏ ఒప్పందం మీదా సంతకం చేయకపోవడం చాలా మంచిది. ఆదాయం ఎంత పెరిగినప్పటికీ అందులో చాలా భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు మిత్రులు, నమ్మినవారు ఆర్థికంగా నష్టం కలిగించే సూచనలు కూడా ఉన్నాయి. తండ్రితో గానీ, తండ్రి వైపు వారితో గానీ అకారణ వైరం ఏర్పడవచ్చు.
- కన్య: ఈ రాశికి వ్యయాధిపతి అయిన రవి సప్తమ కేంద్రంలో సంచారం చేస్తున్నందువల్ల దాంపత్య జీవి తంలోనూ, భాగస్వామ్య వ్యాపారాల్లోనూ అనుకోని చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో మనస్పర్థలు తలెత్తడం, అభిప్రాయభేదాలు ఏర్పడడం, ఏదో విధంగా ఎడబాటు కలగడం వంటివి జరగవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వాములతో వివాదాలు ఏర్పడి కోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
- తుల: ఈ రాశివారికి లాభాధిపతి అయిన రవి ఆరవ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల, ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చుల భారం పెరిగి ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. ప్రభుత్వ మూలకంగా సమస్యలు తలెత్తుతాయి. పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధువులతో సమస్యలుంటాయి. తండ్రితో వైరం ఏర్పడుతుంది.
- కుంభం: ఈ రాశివారికి సప్తమాధిపతిగా పాపి అయిన రవి కుటుంబ స్థానంలో సంచరించడం కుటుంబ జీవితానికి శ్రేయస్కరం కాదు. కుటుంబపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బాగా ధన నష్టం జరిగే సూచనలున్నాయి. విలువైన వస్తువులు కోల్పోవడం, దొంగతనాలు జరగడం, నమ్మినవారు మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికిఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం శ్రేయస్కరం. ఏ మాట మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతిగా పాపి అయిన రవి ఈ రాశిలోనే సంచరించడం వల్ల ఆర్థిక వ్యవహా రాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఇతరుల స్వార్థానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం సమస్యలను సృష్టిస్తుంది. మంచి చేయబోయినా చెడు ఎదురవు తుంది. కష్టార్జితం బాగా వృథా అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.