Kuja Dosha: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి దాంపత్య సమస్యలు.. జాగ్రత్త!
ప్రస్తుతం మీన రాశిలో రాహువుతో కలిసి ఉన్న కుజుడి వల్ల వైవాహిక జీవితంలో అడపాదడపా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ వరకూ కుజుడు మీన రాశిలో మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉన్నందువల్ల జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న వివాదమూ పెద్దదయ్యే అవకాశముంటుంది. కోపతాపాలు పెరిగే సూచనలున్నాయి.
ప్రస్తుతం మీన రాశిలో రాహువుతో కలిసి ఉన్న కుజుడి వల్ల వైవాహిక జీవితంలో అడపాదడపా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ వరకూ కుజుడు మీన రాశిలో మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉన్నందువల్ల జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న వివాదమూ పెద్దదయ్యే అవకాశముంటుంది. కోపతాపాలు పెరిగే సూచనలున్నాయి. ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. ప్రస్తుతం కుజుడి మీన రాశి సంచారం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు తప్పకపోవచ్చు. ప్రతి రోజూ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకోవడం వల్ల లేదా సుందర కాండ పారాయణం చేయడం వల్ల ఎటువంటి అరిష్టాలైనా తప్పిపోతాయి.
- మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి కుజుడు సంచారం చేస్తున్నందువల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగస్వామితో తాత్కాలిక వియోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు ఎక్కువ కావడం గానీ, దూర ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరుగుతుంది. కలిసి ఉన్న పక్షంలో ప్రతి చిన్న విషయానికి మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వాదోపవాదాలకు, అపార్థాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. ఈ దోషం వల్ల జీవిత భాగ స్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొద్దిపాటి ఎడబాటు తప్పక పోవచ్చు. బంధువుల కారణంగా ఇద్దరి మధ్యా సమస్యలు తలెత్తడం, ఒకరికొకరు దూరంగా ఉండడం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించడం వంటివి జరిగే సూచనలున్నాయి. కోపతా పాలు ఎక్కువవుతాయి. దంపతుల్లో ఒకరు వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.
- కన్య: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల కుజ దోష ప్రభావం రెట్టింపు అనుభవానికి వస్తుంది. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. చిన్న సమస్యలు, వివాదాలు సైతం చినికి చినికి గాలి వానలో పెరిగి పోయే అవకాశం ఉంది. సాధారణంగా మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుజు డితో రాహువు కలిసి ఉన్నందువల్ల బంధువులు కొందరు అగ్నికి ఆజ్యం పోసే సూచనలున్నాయి.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల సుఖ నాశనం కలుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. జీవిత భాగస్వామితో అనుకో కుండా వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. ఇందుకు కొంత ఆస్తి సమస్యలు కూడా కారణం కావచ్చు. టెన్షన్లు పెరిగే సూచనలు ఉన్నాయి. విడాకులకు సంబంధించిన కేసులు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అన్ని విషయాల్లోనూ ఓర్పు, సహనాలు పాటించడం చాలా మంచిది.
- కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో, అంటే కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడు తోంది. దీనివల్ల ఆర్థిక వ్యవహారాల కారణంగా దంపతుల మధ్య చిటపటలు పెరిగే అవకాశం ఉంది. వాదోపవాదాలతో ఇద్దరి మధ్యా ఎడబాటు ఏర్పడుతుంది. మాట తొందర వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొద్ది రోజుల పాటు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు., పారదర్శకంగా వ్యవహరించవలసి ఉంటుంది.
- మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల కుజ దోషం ఏర్పడింది. ఆధిపత్య ధోరణి కారణంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అహంకారం, మొండి పట్టుదల వంటి కార ణాల వల్ల ఇద్దరి మధ్యా సంబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కొద్దిగా రాజీమార్గం అనుసరిం చడం వల్ల, సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఇద్దరి మధ్యా ఎడబాటు రావడానికి ఎక్కువగా అవకాశ ముంది.