Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావొచ్చు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (మే 23. 2024): మేష రాశి వారికి ఈ రోజు అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారు ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 23. 2024): మేష రాశి వారికి ఈ రోజు అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారు ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాల వల్ల సానుకూల ఫలితాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవ హారాల్లో శ్రమపడ్డా పలితం ఉండకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పరవాలేదనిపిస్తాయి. కొందరు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి కొరత ఉండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలన్నిటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలను చేరుకుంటారు. బకాయిలు, బాకీలు వసూలవుతాయి. అధి కారులకు బాగా ఉపయోగపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యక్తిగత పనులు కూడా పూర్తవుతాయి. ఆస్తికి సంబంధించిన ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందక అవస్థలు పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారా లకు లోటుండదు. ప్రయాణాల్లో ఆశించిన ప్రయోజనాలు సిద్ధించకపోవచ్చు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కీలకమైన కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి వస్తారు. కొత్త కార్యక్రమాలను లేదా ప్రయత్నాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది., వ్యాపారాల్లో సామాన్య ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ధన సంబంధమైన ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాల మీద బాగా శ్రద్ధ పెడతారు. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి కొత్త అవకాశాలను అందుకుంటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీ మార్పులు చేపడతారు. ఉద్యో గంలో తప్పకుండా పదోన్నతులుంటాయి. కొందరు స్నేహితులకు సహాయ సహకారాలు అంద జేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా పలుకుబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపో తాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందుతాయి. పెట్టుబడులు పెంచే అవకాశం కూడా ఉంది. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. హోదా పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రతి పనిలోనూ, ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలు, ఆలస్యాలు తప్పకపోవచ్చు. ఆస్తి వ్యవహా రాల్లో సానుకూలతలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపు తారు. వాహన యోగానికి అవకాశముంది. వ్యాపారాల్లో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగాల్లో గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. చిన్నపాటి ప్రయ త్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.