AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 24th May 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2024 | 5:01 AM

Share

దిన ఫలాలు (మే 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉండవచ్చు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యానికి లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో కూడా ఇబ్బందిపడతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల్లో ఒకరి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్ అందుతుంది. ఆర్థిక వ్యవ హారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలసి వస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఉంటుంది. అన్ని విధాలుగానూ రాబడి పెరుగుతుంది. బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరు తాయి. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. చిన్ననాటి మిత్రు లతో విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు ఉండే అవకాశముంది. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశముంది. వృత్తి జీవితంలో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కొందరు బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సీదా సాదాగా కొనసాగుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రావలసిన డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభం పొందుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యయ ప్రయాసలున్నా కొన్ని పనులు, ప్రయ త్నాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధువులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన సహ కారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభవార్త వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు సాను కూ లంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైన విధంగా ప్రయత్నాలు సాగించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశముంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాలొంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. కొందరు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి అదనపు పనిభారం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు అనుకోకుండా ఒక మంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పనులు, ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభం పొందుతారు. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ప్రయాణాలు లాభి స్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. వస్త్రాభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది. రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us