Job Astrology: దశమ స్థానంలో అనుకూల గ్రహాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు..

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఆరు రాశుల వారికి దశమ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం కావడం వంటివి ఈ రాశుల వారికి జరిగే అవకాశముంది.

Job Astrology: దశమ స్థానంలో అనుకూల గ్రహాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు..
Job Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 22, 2024 | 4:41 PM

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఆరు రాశుల వారికి దశమ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం కావడం వంటివి ఈ రాశుల వారికి జరిగే అవకాశముంది. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశులకు రాబోయే రెండు నెలల్లో ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

  1. వృషభం: ఈ రాశికి దశమంలో దశమాధిపతి శని సంచారం వల్ల తప్పకుండా ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. శని ప్రైవేట్ రంగానికి కారకుడైనందువల్ల వీరికి ప్రభుత్వోద్యోగాల కంటే ప్రైవేట్ ఉద్యోగాలే లభించే సూచనలున్నాయి. ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది. మంచి జీతభత్యాలతో కూడిన ప్రైవేట్ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిర త్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ఇప్పట్లో అవకాశం లేదు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల ప్రైవేట్ రంగంలో వీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశముంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. వీరికి మంచి గుర్తింపు రావ డంతో పాటు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఏదైనా వ్యాపారంలో ప్రవేశించినా బాగా రాణించడం జరుగుతుంది. ఉద్యోగంలో ఈ రాశివారికి శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమంలో బుధు సంచారం వల్ల ప్రైవేట్ రంగంలో ఉద్యోగం లభించడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో వీరి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా బాగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆశించిన జీతభత్యాలు లభించే సూచనలున్నాయి. వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. సాధారణంగా ఆర్థిక విభా గాలు, ఆర్థిక వ్యవహారాలు వీరికి మంచి భవిష్యత్తునిస్తాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి.
  4. సింహం: రాశ్యధిపతి రవితో పాటు గురువు, శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నందువల్ల నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం నుంచే కాక, ప్రభుత్వ రంగం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఏ రంగం అయిన ప్పటికీ వీరికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందడం, డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఎక్కువగా ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో భారీ జీత భత్యాలు లభించే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఒకటి రెండు సార్లు ఉద్యోగంమారిన తర్వాత స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకోకుండా శుభ పరిణామాలు అనుభవానికి వస్తారు. ఊహించని విధంగా పదోన్నతి లభిస్తుంది.
  6. కుంభం: ఈ రాశికి దశమ స్థానం మీద నాలుగు గ్రహాల దృష్టి పడడం ఒక విశేషం. ఈ రాశివారికి కొద్ది ప్రయ త్నంతో ప్రభుత్వ ఉద్యోగంగానీ, ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో ఉద్యోగంగానీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ఉన్నవారు విశేషమైన అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలో భారీ జీతభత్యాలతో ఉద్యోగంలో స్థిరత్వం లభించే సూచనలున్నాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందడం జరుగుతుంది.