AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశులవారు లవబుల్ పెయిర్స్.. ఒక్కటైతే జీవితం ఆనందమే.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..

బంధం బలపడాలంటే.. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆకర్షణకు.. ప్రేమకు వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంటుంది..

Zodiac Signs: ఈ రాశులవారు లవబుల్ పెయిర్స్.. ఒక్కటైతే జీవితం ఆనందమే.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..
Zodiac
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 9:56 PM

Share

బంధం బలపడాలంటే.. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆకర్షణకు.. ప్రేమకు వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఏలాంటి బంధంలోనైనా అర్థం చేసుకోవడం.. సహనం.. ఒకరిపై మరొకరికి ఇష్టం.. గౌరవం ఉంటే ఆ బంధం ఎన్ని సంవత్సరాలైన సంతోషంగా ఉంటుంది. అయితే మన భారతీయ సంస్కృతిలో వివాహం జరిపించాలంటే ముందుగా వారి జాతకాలను పరిశీలిస్తారు కదూ. నిజమే.. కొన్ని రాశుల వారు కలుసుంటే ఎంతో సంతోషంగా జీవిస్తారు. అలాంటి వారి బంధంలో ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి పోరాడుతారు. ఒకరు సున్నితంగా ఉన్నా.. మరికొందరు చాలా ధైర్యంగా ఉంటారు. ఇలాంటి బంధాలు మాత్రం ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు ఇష్టపడే అవకాశం ఉన్న రాశులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మీనం.. ధనుస్సు.. ఇది అసంభవమైన జంట.. మీనరాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు స్వేచ్ఛ, ప్రయాణం, సాహసం గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ వీరిద్ధరిలో ఉండే ఉమ్మడి స్వభావం.. సన్నిహితులపై ప్రేమ. ఇద్దరు తమ ఆత్మీయుల పట్ల సున్నితంగా ఉంటారు.. ప్రేమకు ఎంతో విలువనిస్తారు. ఇద్దరూ ఒకరి సృజనాత్మకతను ప్రోత్సాహిస్తారు.

వృషభం..మకరం.. ఈ రెండు రాశులు పూర్తిగా వ్యతిరేకం.. ఇద్దరి స్వభావాలు విభిన్నం.. వీరు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. కానీ ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకుంటారు. మకర రాశివారు మరింత ఆచరణాత్మకంగా.. వాస్తవికంగా ఉంటారు.. వృషభ రాశి వారు ఎక్కువగా కలలు కంటారు. ఒకరినొకరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఇద్దరికీ ఎక్కువగా ప్రేమ ఉంటుంది.

మేషం.. కుంభం.. ఈ రెండు రాశులు పూర్తిగా వ్యతిరేకం. మేషరాశి ఎప్పుడు ఇతరులపై తిరగబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కుంభరాశుల వారి మనసులోనే కోపాన్ని ప్రదర్శిస్తారు. అయితే వీరిద్దరి మాత్రం సమస్యలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇద్దరూ ఎంతో అర్థం చేసుకోవడమే కాకుండా..బంధానికి వీలువనిస్తారు.

మిథునం.. కర్కాటకం.. వీరిది ఊహించని బంధం. మిథున రాశి.. కర్కాటక రాశి వారు బలమైన బంధం. వీరు.. స్నేహనికి.. ప్రేమకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కర్కాటక రాశివారు.. మిథునరాశికి ఓపికగా.. స్థిరంగా ఉండాలని సూచిస్తుంటారు. ఇక కర్కాటక రాశివారికి సామాజికంగా.. బయట ఎలా ఉండాలనేది బోధిస్తుంటారు. వీరిద్దరూ ఒకరినొకరి వ్యక్తిత్వాలను ప్రేమించుకుంటారు.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్