Horoscope Today: వీరికి శత్రువులూ మిత్రులే.. డబ్బు అలా వచ్చిపడుతుంది.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ఉద్యోగ జీవితంలో సమర్థతకు, పని తీరుకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత జాగ్ర త్తగా ఉండాలి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా చాలావరకు ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు అందు తాయి. జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు స్థానికంగా మంచి ఆఫర్ అందుతుంది. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. వ్యక్తిగత సమస్యల్ని కూడా తీర్చుకోగలుగుతారు. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. సమర్థతకు మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. రావ లసిన డబ్బును వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగి పోతాయి. రాబడి బాగా పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. హోదా లభించే అవకాశం ఉంది. రాదను కున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలువుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువుల నుంచి ఇబ్బందికర వార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదా యం నిలకడగా సాగిపోతుంది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం బాగా పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు తప్పకుండా చేతికి అందుతాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవ కాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయి కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )
ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటుండదు. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మనస్పర్థలు ఏర్పడే సూచన లు న్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక, కుటుంబ వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దగ్గర బంధు వుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. రుణ సమస్యలు తగ్గుతాయి. కొన్ని బరువు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో సమర్థతకు, పని తీరుకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోక పోవడం మంచిది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.