AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి ఆదివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (దిన ఫలాలు November 23, 2025): మేషం రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృషభం రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మిథునం రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి ఆదివారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2025 | 7:54 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా పని భారం వల్ల శరీరానికి విశ్రాంతి ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. బంధుమిత్రుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లబిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తి గత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సా హకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరి స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. సన్నిహితులు తప్పు దోవ పట్టించే సూచనలున్నాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు భారీగా ఆర్థిక సహాయం చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందు తారు. పెళ్లి ప్రయత్నాల్లో సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. బంధువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. ఆశలు వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. ఆస్తి వివాదం నుంచి సురక్షితంగా, సానుకూలంగాబయటపడతారు. ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉండడం మంచిది. వీలైనంతగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ బాధ్యతల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ విధుల్ని సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయం వృద్ది చెందుతుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి విలువ పెర గవచ్చు. కొత్త ఆస్తుల మీద దృష్టి పెడతారు. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. రోజంతా బిజీగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడు గులు వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగ స్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరు ద్యోగులకు ఉద్యోగ సంబంధమైన అనుకూలత కలుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవు తుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెడతారు. జాగ్రత్తగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అయి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనేక విధాలుగా లాభాలు అందుకుంటారు. అవసర సమయాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా, స్థాయి పెరుగుతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నష్టాల నుంచి బయటపడతాయి. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరు గుతుంది. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపో తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, లాభాలకు, కార్యకలాపాలకు లోటుండదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాల్లో ప్రస్తుతానికి కొద్దిగా తగ్గి ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సహోద్యోగులు ఆశించినంతగా సహక రించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు కలుగు తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది.

Follow Us