Horoscope Today: వీరికి ఒకట్రెండు శుభవార్తలు, ఆదాయానికి లోటుండదు.. శనివారం రాశిఫలాలు ఇలా
వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించినం తగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు. తల పెట్టిన పనులు చాలావరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సోదరులతో సఖ్యత పెరుగు తుంది. ఆదాయానికి లోటుండదు. ఆస్తి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు, అవివాహితులు ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగు తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల పరిస్థితి లాభ దాయకంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బంధువుల వ్యక్తిగత విష యాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. దాంపత్య జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఆర్థిక సమస్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుం టారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తల పెట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కొద్దిగా ఒత్తిడి ఉన్నా ఆశించిన ఫలితాలు సాధి స్తారు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. దైవ సేవ, సామాజిక సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. జీతభత్యాలపరంగా శుభ వార్తలు వింటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి కొద్దిగా బయట పడే సూచనలున్నాయి. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పనుల్ని సకా లంలో పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరి ష్కారమై మానసికంగా ఊరట లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. బంధువుల రాక పోకలుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ధన లాభం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశ ముంది. ముఖ్యంగా వృత్తి జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపి స్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆదాయానికి లోటుండకపో వచ్చు. కుటుంబ విషయాలు సజావుగా సాగిపోతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
బంధుమిత్రులకు సహాయంగా నిలబడతారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. రావలసిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సాను కూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగు తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించినం తగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్ని పట్టుదలగా కొనసాగిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాల్లో యాక్టి విటీ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొన సాగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఉపశ మనం లభిస్తుంది. ఒకరిద్దరు బంధుమిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.



