Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (04 November 2025): మేష రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృషభ రాశి వారికి పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆర్థికంగా బలం పెరుగుతుంది. మిథున రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (నవంబర్ 4, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితులకు అవసర సమయాల్లో బాగా సహాయపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఒకటి రెండు మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలను సజావుగా చక్కబెడతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో మీ సరికొత్త ఆలోచనలు ఆశించిన ఫలి తాలనిస్తాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అధిక లాభాలనిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు సమసిపోతాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగిపోతాయి. అనారోగ్యాలు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పెండింగ్ పనులన్నీ మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగి పోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, సమస్యలను అధిగమించగలుగుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్ట పోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను, లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు సవ్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు సాఫీగా పురోగమిస్తాయి. ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ చేయవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో ప్రత్యేకమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి రంగంలో ఉన్నవారికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో భాగస్థులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగులకు పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కూడా ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సన్నిహిత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఇంట్లో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని తీరుతో అధికారులను, సహచరులను ఆకట్టుకుంటారు. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆస్తి సంబంధమైన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార లాభంతో పాటు ఆదాయ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు.



