AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 12, 2026): దినఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా, అధికారాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపించనుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు వివిధ రంగాల్లో మార్పులను సూచిస్తున్నాయి.

Horoscope Today: ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 12 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా, అధికారాలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో హోదా, అధికారాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యలు చక్కబడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులను పూర్తి చేయడంలో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆదాయ ప్రయ త్నాలు మరింత విస్తరిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో జీతభత్యాలు, పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వింటారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి విషయంలో పైచేయి సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పురోగమిస్తాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు ఆదాయ వృద్ధికి తోడ్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్య క్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలకు ఎదురుండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. అధికార వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధుమిత్రులతో తలెత్తిన అపార్థాలు, వివాదాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు హ్యాపీగా సాగుతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొత్త ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాన్ని తేలికగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

అనుకోకుండా బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా శుభ వార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. తలపెట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన శుభ వార్త అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ పరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి సరైన ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడ తారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.