Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (Feb 5, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృషభ రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారికి ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఫిబ్రవరి 5, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే సూచనలున్నాయి. మిథున రాశి వారికి ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కివచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఇతరుల బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగుతాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో చిన్నాచితకా సమస్యలుంటాయి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు తనంతో వ్యవహరించవద్దు. ఇంటా బయటా కాస్తంత శ్రమాధిక్యత ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత కలుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంటాబయటా మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరులకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి బాగా వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కొద్దిగా శ్రమ, తిప్పట తప్పక పోవచ్చు. కొందరు సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనుల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గ రాబడి ఉంటుంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రానికి వెడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. చేతిలో అవసరానికి మించి డబ్బు ఉండే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
థనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. కుటుంబసమేతంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బందిపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన ఆఫర్ అందుతుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.