Horoscope Today: ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (February 07, 2026): మేష రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశ వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఫిబ్రవరి 7, 2026): మేష రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశ వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో లాభాలందుతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
గృహ, వాహన కొనుగోళ్ల మీద దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. స్థిరాస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో లాభాలు పొందు తారు. వృత్తి, ఉద్యోగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా పూర్తవుతుంది. ఆస్తి వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో మీ ప్రణాళికలు, ప్రాజెక్టులు అధికారులకు నచ్చుతాయి. మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. కొందరు మిత్రుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆహార. విహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు కలసి వచ్చే సమయం ఇది. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవు తాయి. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో వివాదాలు, అపా ర్థాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గిపోతాయి. ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. సహచరులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఇతరుల వ్యవ హారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచ డానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగంలో ఆదరణ, గుర్తింపు పెరుగుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు, బాకీలు వసూలవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయి, ఊరట చెందుతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. ఆదాయపరంగా కలిసి వచ్చే సమయం ఇది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. పెండింగ్ పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నా, ఆశించిన స్థాయిలో ప్రతి ఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.