Horoscope Today: వీరికి కావల్సినంత డబ్బు ఉన్నా జేబుకు చిల్లే.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆదరణ, గుర్తింపు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు, బాకీలు పూర్తిగావసూలవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత వల్ల విశ్రాంతి కరువవు తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు సాను కూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అదికారం చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చ వుతుంది. డబ్బు కలిసి వచ్చే సమయం ఇది. ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి ఉన్నా ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్లో లాభాలు అందుతాయి. కుటుంబ పెద్దల సహాయంతో వ్యక్తిగత సమస్యలు దూర మవు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది, వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. వృథా ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారంలో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. నిరుద్యోగులు మరింతగా ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించి ప్రతిఫలం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయా ణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లుఅందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పురోగమిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబంలో తొందర పాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. తోబుట్టువులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదం నుంచి పూర్తిగా బయటపడ తారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపో తుంది.



