- Telugu News Photo Gallery Spiritual photos Zodiac Signs to Get Rich: 6 Astrological Fortunes for Additional Income Telugu Astrology
Money Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశుల వారికి అదనపు ఆదాయం గ్యారంటీ!
అసలు ఆదాయం కంటే అదనపు ఆదాయం మీద చాలామందికి మోజు ఉంటుంది. చాలామందికి అదనపు ఆదాయం అవసరం కూడా కావచ్చు. జీతభత్యాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, అదనపు ఆదాయం వల్ల అనేక అవసరాలు తీరిపోవడం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఈ అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. గురువు ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అదనపు ఆదాయానికి అవకాశాలు పెరుగుతాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారు ఇటువంటి ఆదాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులవుతారు.
Updated on: Dec 04, 2025 | 6:34 PM

వృషభం: ఈ రాశికి ఈ నెల 6 తేదీ నుంచి ధన స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల అదనపు ఆదాయం మీద ఈ రాశివారి శ్రద్ధాసక్తులు మరింతగా పెరుగుతాయి. వీరి ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. జీతభత్యాల కంటే ఇటువంటి ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి. బంధుమిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం కూడా ఉంది.

మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారు అదనపు ఆదాయం సంపాదించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. తమ అనుభవాన్ని, నైపుణ్యాలను అదనపు ఆదాయ వృద్ధికి బాగా ఉపయోగించే అవకాశం ఉంది. జనవరి నుంచి వీరి అదనపు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. వీరి ఆర్థిక సమస్యలు, ఆర్థిక అవసరాలు పూర్తిగా తీరిపోవడంతో పాటు, వీరి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా వీరు ఆదాయాన్ని పెంచుకుంటారు.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అదనపు ఆదాయ అవకాశాలు కలిసి వస్తాయి. వీరికి అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. తమ నైపుణ్యాలు, ప్రత్యేకతలన్నిటినీ పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు, సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడం, భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటివి చేపడ తారు.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి జీతభత్యాలతో పాటు అదనపు ఆదా యం కూడా ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇతర వ్యాపారాల్లోనూ, షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారానూ వీరు అదనపు ఆదాయాన్ని బాగా వృద్ధి చేయడం జరుగుతుంది. ఇటువంటి ఆదాయం కోసం వీరు చేయని ప్రయత్నం, ఉపయోగించని అవకాశం ఉండకపోవచ్చు. స్థలాలు, పొలాల మీద పెట్టుబడులు పెడతారు.

ధనుస్సు: రాశ్యధిపతి, ధన కారకుడు అయిన గురువు సప్తమ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు మరీ విస్తృతం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అదనపు ఆదాయం కోసం వీరు ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయంతో వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం, వడ్డీ వ్యాపారం చేయడం జరుగుతుంది.

కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ప్రవేశించిన తర్వాత నుంచి ఈ రాశివారికి అదనపు ఆదా యం మీద మరింతగా వ్యామోహం పెరుగుతుంది. సాధారణంగా వీరు ఏ ఆదాయ అవకాశాన్నీ జారవిడుచుకోరు. ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు. అదనపు ఆదాయం మీద శ్రమ బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని ఇతర ఆదాయ వృద్ధి మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు.



